అక్షరటుడే, ఆర్మూర్: Armoor Police | మహిళను హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను శనివారం ఆర్మూర్ పోలీసులు(Armoor) అరెస్టు చేశారు. ఈ మేరకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో (Armoor Police station) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ వివరాలను వెల్లడించారు.
Armoor Police | ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో..
ఆలూర్(alur) మండలం మచ్చర్ల గ్రామంలో సుంకర జయపాల (52) అనే మహిళ నివాసం ఏర్పరచుకున్నారు. కాగా, ఆమె ఇంటి ఎదురుగా ఆలూరు గ్రామానికి చెందిన గోసంగి మల్లేష్, అతని భార్య పోశవ్వ అద్దెకు ఉంటున్నారు.
ఈ క్రమంలో జయపాలతో స్నేహం పెంచుకున్నారు ఆమె బంగారు నగలు దొంగిలించాలని ఉద్దేశంతో ఈనెల (ఏప్రిల్) 14 రాత్రి 11 గంటలకు జయపాల ఇంట్లోకి చొరబడి ఆమె ముఖంపై దిండు పెట్టి, గొంతునొక్కి హతమార్చారు.
అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు, మాటీలు, ముక్కుపుడక, వెండి పట్టీలు, మెట్టెలు, బీరువాలో ఉన్న రోల్డ్ గోల్డ్ తీగ, గాజులు ఇతర విలువైన వస్తువులను దోచుకుని పారిపోయారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పక్కా సమాచారంతో ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీ సంతోష్‌నగర్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సొత్తు రికవరీ చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
ఇది కూడా చదవండి: Farmer Heat Stroke | పొలం గట్టుపై పోయిన ప్రాణం.. వడదెబ్బతో రైతన్న మృతి
