అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar Back Water | చేపలు పట్టేందుకు వెళ్లి అదుపుతప్పి పడిపోయి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి (Yelalreddy) మండలం బ్రాహ్మణపల్లి పరిధి నిజాంసాగర్(Nizamsagar) బ్యాక్వాటర్లో చోటుచేసుకుంది.
Nizamsagar Back Water | బ్రాహ్మణపల్లిలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాటూరి మల్లేష్ (33) తన మిత్రుడు సాయితో కలిసి శనివారం (ఏప్రిల్ 18) ఉదయం రుద్రారం గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ (backwaters tragedy) వద్ద చేపలు(fishing accident) పట్టేందుకు వెళ్లాడు.
నీటిలో ఒక గట్టు నుంచి మరో గట్టుకు వెళ్లేందుకు వలను తన వెంట పట్టుకుని ఈదుతుండగా.. ఆ వల అతని కాళ్లకు చుట్టుకుంది. దీంతో ఈత కొట్టలేక నీటిలో మునిగి ఊపిరాడక మల్లేష్ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మల్లేష్ భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Armoor Police | మహిళ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
