Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mudiraj Population Issue | ముదిరాజ్​ల సంఖ్యను తగ్గించి చూపడం సరికాదు : ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Mudiraj Population Issue | ముదిరాజ్​ల సంఖ్యను తగ్గించి చూపడం సరికాదు : ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్

నిజామాబాద్

Mudiraj Population Issue | ముదిరాజ్​ల సంఖ్యను తగ్గించి చూపడం సరికాదు : ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్

రాష్ట్రంలో ముదిరాజ్​లను 20 లక్షల వరకు తగ్గించి చూపడం సరికాదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్​ అండ్​బీ గెస్ట్ హౌస్​లో మీడియాతో మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 18, 2026 10:04 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Mudiraj Population Issue |
Mudiraj Population Issue | రాష్ట్రంలో ముదిరాజ్​లను తగ్గించి చూపడం సరికాదు..

అక్షరటుడే, కామారెడ్డి: Mudiraj Population Issue | తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్​ల సంఖ్యను 20 లక్షల వరకు తగ్గించి చూపడం సరికాదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి (Mudiraj Rights Realization Committee) రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఆర్​ అండ్​ బీ గెస్ట్ హౌస్​లో శనివారం మీడియాతో మాట్లాడారు.

Contents
  • Mudiraj Population Issue | అధ్వానంగా రాష్ట్ర జనాభా లెక్కలు..
    • Mudiraj Population Issue | మత్స్యశాఖలో ముదిరాజ్​లకు సమానహక్కులివ్వాలి..
      • Mudiraj Population Issue | కామారెడ్డి డిక్టరేషన్​ అమలు చేయకుంటే..

Mudiraj Population Issue | అధ్వానంగా రాష్ట్ర జనాభా లెక్కలు..

రాష్ట్రంలో జనాభా లెక్కలు అధ్వానంగా చేపట్టారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సకల జనుల సమ్మెలో 2014-15 లో ముదిరాజ్​లు 46 లక్షలు ఉండేవారని తెలిపారు. గత 12 ఏళ్లలో ఉన్న జనాభాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం 26 లక్షలకు తగ్గించిందన్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ముదిరాజ్ సమాజం అంతరించి పోతుందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అధ్వానంగా జాతులను ఎక్కువ, తక్కువగా చూపుతూ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. ముదిరాజ్​లను బీసీ డీ నుంచి ఏ లోకి మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉందని, దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు.

Mudiraj Population Issue | మత్స్యశాఖలో ముదిరాజ్​లకు సమానహక్కులివ్వాలి..

98 జీవో ప్రకారం మత్స్య శాఖలో (Department of Fisheries) ముదిరాజ్​లకు సమానమైన హక్కు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. ముదిరాజ్​ల మీద సీఎంకు ఎలాంటి ప్రేమ ఉందో ఈ లెక్కలతో స్పష్టం అవుతోందన్నారు.

వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటేనని, ఇప్పటివరకు ముదిరాజ్​ల అంశాన్ని సీఎం దగ్గర చర్చించలేదన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్​ను చేసినా ఒక్క రూపాయి కేటాయించలేదని, అలాంటప్పుడు కార్పొరేషన్ దేనికి.. ఛైర్మన్ పదవి ఎందుకు..? అని ప్రశ్నించారు.

పేరుకే కార్పొ రేషన్, ఛైర్మన్ ఉన్నారని, పేరుకే ఎమ్మెల్యే.. మంత్రి ఉన్నారని మండిపడ్డారు. ముదిరాజుల జనాభా లెక్కలను 20 లక్షలకు కుదించి ముదిరాజ్​లను తొక్కేశారన్నారు. ఎన్నికల్లో బీసీ డి నుంచి ఏ లోకి మారుస్తామని హామీ ఇచ్చారన్న విషయం గుర్తుందా అని ప్రశ్నించారు.

ఇకనైనా మంత్రి, ఛైర్మన్లకు కనువిప్పు కలగాలని, ఈటల రాజేందర్, బండ ప్రకాష్ లాంటి వాళ్ళు ముందుకు రావాలన్నారు. ముదిరాజ్ హక్కుల సాధన సమితి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

Mudiraj Population Issue | కామారెడ్డి డిక్టరేషన్​ అమలు చేయకుంటే..

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ స్థాయిలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామన్నారు. తమకు రిజర్వేషన్ ఇవ్వాలని, మత్స్య శాఖలో సముచిత స్థానం కల్పించాలని, కార్పొరేషన్​కు రూ.5 వేల కోట్లు కేటాయించి ఉపాధి మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల సుధాకర్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పడిగే ప్రశాంత్, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్​ఛార్జి ఉప్పాల బాలేష్, కామారెడ్డి జిల్లా మీడియా ఇన్​ఛార్జి రాజు ముదిరాజ్, డివిజన్ మీడియా ఇన్​ఛార్జి చెట్టబోయిన స్వామి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి శిలాపురం రాజు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

Shabbir Ali Welfare Priority | ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత: షబ్బీర్​అలీ
Telangana Political News | మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయం: ఎంపీ అర్వింద్​
Village Development Goal | గ్రామాలను అభివృద్ధే చేయడమే ప్రభుత్వ లక్ష్యం
Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
TAGGED:bc reservation issuecaste census indiacaste data controversyCM Revanth ReddyDepartment of FisheriesKamareddyMudiraj communityMudiraj rightssocial justice IndiaTelangana newsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad Premier League | Nizamabad Premier League | నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​కు రంగం సిద్ధం.. పాల్గొనే జట్ల ఎంపిక పూర్తి
Next Article Armoor Police | Armoor Police | మహిళ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు నిందితుల అరెస్టు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?