Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold Rate April 14 | అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Gold Rate April 14 | అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

బిజినెస్​తాజా వార్తలు

Gold Rate April 14 | అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్ బలపడటం వంటి పరిణామాల నేపథ్యంలో గత వారం పెరిగిన బంగారం, వెండి ధరలు ఈ వారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 8:15 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Gold Rate April 14

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gold Rate April 14 | పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Contents
  • Gold Rate April 14 | కాస్త త‌గ్గిన ధ‌ర‌లు..
    • Gold Rate April 14 | అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో..

ఇదే సమయంలో అమెరికన్ డాలర్ Dollar బలపడడం కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల మధ్య గత వారం పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 14) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,450గా నమోదైంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,39,740గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద ఉంది. విజయవాడలో కూడా ఇదే స్థాయి ధరలు నమోదయ్యాయి.

Gold Rate April 14 | కాస్త త‌గ్గిన ధ‌ర‌లు..

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇదే ధోరణి కొనసాగుతోంది. చెన్నైలో (Chennai) 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,370గా ఉండగా, ముంబై, బెంగళూరులో రూ.1,52,450గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ.1,40,590గా ఉండగా, ముంబై, బెంగళూరులో రూ.1,39,740గా కొనసాగుతోంది. వెండి ధరల విషయంలో కూడా తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో కిలో వెండి ధర రూ.2.54 లక్షల నుంచి రూ.2.59 లక్షల మధ్య మారుతోంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలో సుమారు రూ.380 తగ్గుదల నమోదైంది. ఆభరణాల బంగారం ధర రూ.350 మేర తగ్గగా, వెండి ధరలో దాదాపు రూ.5,000 వరకు కోత పడింది.

Gold Rate April 14 | అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరలు మరియు డాలర్ మార్పులు కొనసాగుతున్నంత కాలం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని భావిస్తున్నారు. పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Trump Naval Warning | ఆ నౌకలను వాటిని ధ్వంసం చేస్తాం..ట్రంప్​ వివాదాస్పద హెచ్చరిక!

March 06 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
March 30 Horoscope | ఈ రాశుల వారికి ప్రశంసలు.. కెరీర్‌లో ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Colombia Plane Crash | కొలంబియాలో విషాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. భారీ ప్రాణ నష్టం!
 GHMC Property Seizure | హైదరాబాద్​లో మాజీ సీఎం ఇల్లు సీజ్​
TAGGED:24K Gold Ratebullion market Indiaglobal gold newsGold Price Updategold prices indiagold rate april 14investment in goldsilver rates today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 14 Horoscope April 14 Horoscope | అధికారుల మెప్పు.. పెరగనున్న హోదా.. ఆఫీసులో ఈ రాశుల వారిదే అప్పర్ హ్యాండ్!
Next Article Praful Hinge Praful Hinge | నాలుగు వికెట్లు తీసి రాజ‌స్థాన్ ఓట‌మిని శాసించిన ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్.. అప్పుడు లెద‌ర్ బాల్ అంటే కూడా తెలియ‌ద‌ట‌..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?