అక్షరటుడే, వెబ్‌డెస్క్: Praful Hinge | ఐపీఎల్ వేదికగా మరో కొత్త స్టార్ వెలుగులోకి వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసిన యువ పేసర్ ప్రఫుల్ హింగే (Praful Hinge) అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ లాంటి పటిష్ట జట్టును కేవలం తన బౌలింగ్‌తో కుదేలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేధించడం రాజస్థాన్‌కు పెద్ద సవాలు కాదనిపించినా.. ప్రఫుల్ హింగే బౌలింగ్‌తో మ్యాచ్ మలుపుతిరిగింది.
Praful Hinge | వణికించాడు..
ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేయడానికి వచ్చిన హింగే, మొదటి బంతికే ప్రమాదకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఔట్ చేశాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతికి ధ్రువ్ జురెల్‌ను కూడా డకౌట్ చేయడంతో రాజస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. అనంతరం లూయాన్-డ్రే ప్రిటోరియస్, రియాన్ పరాగ్ (Riyan Parag) వికెట్లు కూడా పడగొట్టి మొత్తం 4 వికెట్లతో రాజస్థాన్ పతనానికి కారకుడయ్యాడు. ఫలితంగా సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న హింగే తన భావోద్వేగాలను పంచుకున్నాడు. “నా అరంగేట్ర మ్యాచ్‌లోనే 4 నుంచి 5 వికెట్లు తీయాలని నేను ముందే నా డైరీలో రాసుకున్నాను. గట్టిగా నమ్మితే ఏదైనా సాధ్యమే. పవర్‌ప్లేలో బ్యాటర్లపై ఒత్తిడి తేవాలని ప్లాన్ చేశాను. వైభవ్‌ను బౌన్సర్‌తో ఔట్ చేస్తానని ముందే చెప్పాను. మా బౌలింగ్ కోచ్ సహాయంతో ఆ ప్లాన్ సక్సెస్ అయింది” అని తెలిపాడు.
Praful Hinge | 13 ఏళ్ల వయసులో..
ప్రఫుల్ ప్రయాణం కూడా చాలా ప్రేరణాత్మకంగా ఉంది. చిన్నతనంలో క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, కేవలం 13 ఏళ్ల వయసులో ఆట మొదలుపెట్టాడు. ఆ సమయంలో అతనికి లెదర్ బాల్ అంటే ఏంటో కూడా తెలియదట. మొదట తన తండ్రి క్లబ్‌లో చేర్పించడానికి నిరాకరించినా, తర్వాత ప్రోత్సహించడంతో అతని కెరీర్ మలుపుతిరిగింది. “నా తండ్రే నేను ఈ స్థాయికి రావడానికి కారణం. ఈ అవార్డును Award నా కుటుంబానికి అంకితం చేస్తున్నాను” అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విజయం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ముఖ్యంగా కొత్త ఆటగాళ్ల ప్రతిభ జట్టుకు బలంగా మారుతుందని ఈ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది.
ఇది కూడా చదవండి..: Praful Hinge SRH | తొలి ఓవర్లోనే మూడు వికెట్లు.. యువ బౌలర్ ప్రఫుల్ సంచలనం!
