Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hormuz Strait Tensions | హర్మూజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు.. భారత్‌కు ఇరాన్ భరోసా, అమెరికాపై తీవ్ర విమర్శలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Hormuz Strait Tensions | హర్మూజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు.. భారత్‌కు ఇరాన్ భరోసా, అమెరికాపై తీవ్ర విమర్శలు

అంతర్జాతీయం

Hormuz Strait Tensions | హర్మూజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు.. భారత్‌కు ఇరాన్ భరోసా, అమెరికాపై తీవ్ర విమర్శలు

హర్మూజ్‌ జలసంధిలో అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్న వేళ, భారత నౌకలకు ఎలాంటి ఆటంకం ఉండదని ఇరాన్ హామీ ఇచ్చింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 9:28 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Hormuz Strait Tensions

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hormuz Strait Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. కీలక వాణిజ్య మార్గమైన హర్మూజ్‌ జలసంధిని అమెరికా నౌకాదళం (United States Navy) దిగ్బంధనం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Contents
  • Hormuz Strait Tensions | అమెరికాపై తీవ్ర విమ‌ర్శ‌లు..
    • Hormuz Strait Tensions | చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం

భారీ యుద్ధ నౌకలను మోహరించి ఇరాన్ (Iran) పోర్టులకు వెళ్లే నౌకలను అడ్డుకుంటోంది.ఈ పరిణామాల మధ్య భారత్‌కు ఇరాన్ కీలక భరోసా ఇచ్చింది. హర్మూజ్‌ జలసంధి మీదుగా వెళ్లే భారత నౌకలకు ఎలాంటి ఆటంకం ఉండదని, ఈ మార్గం భారత్‌కు ఎప్పటికీ తెరిచి ఉంటుందని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ (Iran Ambassador Mohammad Fathali) వెల్లడించారు. భారత్ తమకు అత్యంత సన్నిహిత దేశమని పేర్కొంటూ, నౌకల రాకపోకలపై ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Hormuz Strait Tensions | అమెరికాపై తీవ్ర విమ‌ర్శ‌లు..

ఇదిలా ఉండగా, ఇటీవల ఇస్లామాబాద్లో (Islamabad) జరిగిన అమెరికా-ఇరాన్  చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫతాలీ అమెరికా వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. చర్చల పేరుతో వచ్చిన అమెరికా అసలు ఉద్దేశ్యం ఇరాన్‌ను లొంగదీసుకోవడమేనని విమర్శించారు. ఇరాన్ హక్కులను గుర్తించి, చట్టవిరుద్ధమైన డిమాండ్లను పక్కన పెడితేనే భవిష్యత్తులో చర్చలు జరగగలవని స్పష్టం చేశారు. అలాగే 2018లో అమెరికా అణు ఒప్పందం నుంచి వైదొలగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, గత అనుభవాల వల్ల విశ్వాస లోపం ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు కూడా సరైన దిశలో లేవని అభిప్రాయపడ్డారు.

Hormuz Strait Tensions | చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం

మరోవైపు హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz)లో కొనసాగుతున్న దిగ్బంధనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యంగా చమురు సరఫరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, దీని వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇరాన్ చేపట్టిన దాడులు కేవలం అమెరికా సైనిక స్థావరాలపై మాత్రమేనని, పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోలేదని ఫతాలీ స్పష్టం చేశారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తమకు లేదని తెలిపారు. ఇక అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం కావడంలో ఇజ్రాయెల్ పాత్ర ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Israel PM Benjamin Netanyahu), అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో మాట్లాడినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఇజ్రాయెల్  ప్రయోజనాల కోసమే అమెరికా ఈ చర్చలను పక్కదారి పట్టించిందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Trump Naval Warning | ఆ నౌకలను వాటిని ధ్వంసం చేస్తాం..ట్రంప్​ వివాదాస్పద హెచ్చరిక!

Stock Market Losses | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో సూచీలు
Trump Naval Warning | ఆ నౌకలను వాటిని ధ్వంసం చేస్తాం..ట్రంప్​ వివాదాస్పద హెచ్చరిక!
UAE India Missile Deal | భారత రక్షణ రంగంలో కీలక పరిణామం.. బ్రహ్మోస్​, ఆకాశ్​ కొనుగోలుకు యూఏఈ ఆసక్తి!
North Korea Missile | అత్యాధునిక క్షిపణిని తయారు చేస్తున్న ఉత్తర కొరియా
Stock Market Gains | సీజ్ ఫైర్ ఎఫెక్ట్ .. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
TAGGED:Hormuz Strait TensionsIranIran Ambassador Mohammad FathaliIslamabadIsrael PM Benjamin NetanyahuStrait of HormuzUnited States Navy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Praful Hinge Praful Hinge | నాలుగు వికెట్లు తీసి రాజ‌స్థాన్ ఓట‌మిని శాసించిన ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్.. అప్పుడు లెద‌ర్ బాల్ అంటే కూడా తెలియ‌ద‌ట‌..
Next Article US Iran Nuclear Talks US Iran Nuclear Talks | బాల్ ఇప్పుడు వారి కోర్టులోనే ఉంది..: జేడీ వాన్స్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?