అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Iran Nuclear Talks | అమెరికా–ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (US Vice President J.D. Vance) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ వైఖరిని స్పష్టంగా తెలిపారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా కీలక డిమాండ్లను స్పష్టంగా తెలియజేశారన్నారు. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా అప్పగించాలని పేర్కొన్నారు. ఇరాన్ ఈ యురేనియంను భూగర్భం దాచి ఉంచినట్లు అమెరికా భావిస్తోందని చెప్పారు.
US Iran Nuclear Talks | ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండొద్దు
శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్ద ఉండకూడదని జేడీ వాన్స్ అన్నారు. ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండకూడదన్నారు. ఇస్లామాబాద్ (Islamabad)లో జరిగిన ముఖ్య చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు వాన్స్ తెలిపారు. ఇంకా కొన్ని సమావేశాలు జరుపుతామని సూచనప్రాయంగా పేర్కొన్నారు.
“చర్చరలు పూర్తిగా తప్పు మార్గంలో వెళ్లాయని చెప్పలేం. కొన్ని అంశాల్లో మంచి ఫలితాలు కూడా వచ్చాయి. మేం చాలా ముందుకు వెళ్లాం. వారు మా వైపు కొంత దూరం వచ్చారు. అందువల్ల మంచి సంకేతాలు కనిపించాయి. అయితే, పూర్తిస్థాయిలో పురోగతి సాధించలేదు” అని తెలిపారు.
US Iran Nuclear Talks | ఇక ఇరాన్ చేతుల్లోనే ఉంది..
“మరిన్ని చర్చలు జరగాలా లేదంటే.. ఒప్పందం కుదరాలా అనేది పూర్తిగా ఇరాన్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మేం చాలా ముఖ్యమైన ప్రతిపాదనలు టేబుల్ మీద పెట్టాం” అని వాన్స్ చెప్పారు.
ఇది కూడా చదవండి..: Hormuz Strait Tensions | హర్మూజ్ జలసంధిపై ఉద్రిక్తతలు.. భారత్‌కు ఇరాన్ భరోసా, అమెరికాపై తీవ్ర విమర్శలు
