అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jeevan Reddy Statement | రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ అధికారంలోకి రావాలి అన్నదే తన నినాదం అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీని వదిలి.. ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ (BRS)లో చేరుతున్నట్లు తెలిపారు.
జీవన్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 20న బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ సందర్భంగా భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు కేసీఆర్ (KCR) సైతం రానున్నారు. ఈ క్రమంలో సభ విజయవంతం చేయాలని జీవన్‌రెడ్డి అనుచరులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Jeevan Reddy Statement | మేడిగడ్డను చూపి..
మేడిగడ్డ (Medigadda)ను సాకుగా చూపెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలని చూశారని ఆరోపించారు. మూడేళ్లు గడిచే సరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) దోషిగా మారుతున్నారని అన్నారు. అందుకే వారం రోజులుగా మేడిగడ్డను ఎలా పునర్నిర్మించాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు కరువు వస్తే దానికి కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ (Congress Party) అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తన చేరికతో నూతన అధ్యాయం మొదలు కాబోతుందని చెప్పారు. కేసీఆర్‌తో తన అనుబంధం ఈనాటిది కాదని జీవన్‌రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలోకి రాక ముందు నుంచే కేసీఆర్ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తనకు పరిచయం అని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Ambedkar Jayanti | రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర: డిప్యూటీ సీఎం భట్టి
