Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lok Sabha Seats Increase | లోక్​సభ సీట్ల పెంపుపై ప్రధానికి సీఎం లేఖ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Lok Sabha Seats Increase | లోక్​సభ సీట్ల పెంపుపై ప్రధానికి సీఎం లేఖ

తెలంగాణ

Lok Sabha Seats Increase | లోక్​సభ సీట్ల పెంపుపై ప్రధానికి సీఎం లేఖ

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 8:13 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Lok Sabha Seats Increase

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lok Sabha Seats Increase | ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. లోక్​సభ సీట్ల పెంపు విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Contents
  • Lok Sabha Seats Increase | అందరితో చర్చించాలి
    • Lok Sabha Seats Increase | జీఎస్​డీపీ ఆధారంగా..

కేంద్ర ప్రభుత్వం లోక్​సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుతో పాటు మహిళా రిజర్వేషన్​ బిల్లులను ఈ నెల 16న పార్లమెంట్​లో ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో సగటున 50శాతం స్థానాలు పెంచనున్నట్లు సమాచారం. అయితే నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కోరారు.

Lok Sabha Seats Increase | అందరితో చర్చించాలి

నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రతిపాదికన సీట్లను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశారు. దీంతో జనాభా పెరుగుదల ఎక్కువగా లేదు. ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. దీంతో జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు.

Lok Sabha Seats Increase | జీఎస్​డీపీ ఆధారంగా..

సగం సీట్లను జనాభా ఆధారంగా.. మరో సగం సీట్లను రాష్ట్రాల జీఎస్‌డీపీ ఆధారంగా పెంచాలని సీఎం సూచించారు. మహిళా రిజర్వేషన్​ బిల్లును, సీట్ల పెంపుతో కలపడం సరికాదన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్​, నియోజకవర్గాల పెంపు బిల్లులను ఆమోదించాలని కేంద్రం చూస్తోంది.

 

Dear Shri @narendramodi Ji

I am writing this open letter to you in response to the latest proposal to increase Lok Sabha seats to 850.#LokSabhaDelimitation pic.twitter.com/4M566g78kU

— Revanth Reddy (@revanth_anumula) April 14, 2026

దీనిని కూడా చదవండి :  Rythu Bharosa Delay | రైతు భరోసా వచ్చేనా.. రెండో విడతపై స్పష్టత కరువు

BRS Municipal Victory | క్యాతన్​పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​
KPHB Minor Theft Case | పీహెచ్‌బీలో కలకలం.. సారీ అని లేఖ రాసి రూ.25 లక్షల నగదు, బంగారంతో మైనర్ పరార్
Vaishnavi Murder Case | వైష్ణవి హత్య కేసు నిందితుడు హరిబాబు డ్రామా.. ఆసుపత్రిలో హై టెన్షన్ పరిస్థితులు
Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!
Lok Sabha Seats Increase | ఇక లోక్​సభలో 850 సీట్లు.. కేంద్రం కీలక నిర్ణయం
TAGGED:delimitation bill IndiaIndian Parliament newsLok Sabha Seats IncreaseRevanth Reddy newswomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mandal Sabha Arrangements | Mandal Sabha Arrangements | మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Trump Modi Call Trump Modi Call | మోదీకి ఫోన్​ చేసిన ట్రంప్​.. హర్ముజ్​ జలసంధిపై చర్చ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?