Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lung Cancer | చేతి గోళ్లు ఇలా మారుతున్నాయా.. అయితే డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Lung Cancer | చేతి గోళ్లు ఇలా మారుతున్నాయా.. అయితే డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Lung Cancer | చేతి గోళ్లు ఇలా మారుతున్నాయా.. అయితే డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే!

దగ్గేటప్పుడు ఛాతిలో విపరీతమైన నొప్పి, ఎటువంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గిపోవడం, విపరీతమైన అలసట, వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 16, 2026 11:40 సా.
Naresh chandan
9 గంటలు ago
Share
Lung Cancer 
Lung Cancer 

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lung Cancer | సాధారణంగా క్యాన్సర్ అంటే ముదిరిన తర్వాతే బయటపడుతుందని చాలామంది భావిస్తారు. కానీ, మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను గమనిస్తే ఈ ప్రాణాంతక వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో మన చేతి వేళ్లు, గోళ్లు ఇచ్చే సూచనలు అత్యంత కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Contents
  • Lung Cancer | ‘క్లబ్బింగ్’ అంటే..
    • Lung Cancer | భారత్‌లో పెరుగుతున్న ముప్పు:

Lung Cancer | ‘క్లబ్బింగ్’ అంటే..

ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు మన గోళ్లలోనే కనిపిస్తాయి. దీనిని వైద్య పరిభాషలో ‘క్లబ్బింగ్’ అని పిలుస్తారు. ఇందులో వేళ్ల చివరలు మందంగా మారి, గోళ్లు ఉబ్బిపోయినట్లు కనిపిస్తాయి. గోరు ఆకారం కొద్దిగా వంకరగా లేదా గుండ్రంగా మారడం దీని ప్రధాన లక్షణం.

గోళ్ల రంగులో మార్పులు: శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల గోళ్లు పాలిపోయినట్లుగా లేదా నీలి రంగులోకి మారుతుంటాయి. అంతేకాకుండా, గోళ్ల అడుగు భాగం మెత్తగా మారి, వేళ్ల చివరలు ఉబ్బినట్లు అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

ఇతర సాధారణ లక్షణాలు: గోళ్లలో మార్పులతో పాటు ఈ క్రింది లక్షణాలను కూడా గమనించాలి.

ఎన్ని మందులు వాడినా తగ్గని దగ్గు, నడిచినా లేదా చిన్నపాటి పని చేసినా ఆయాసం రావడం, శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గేటప్పుడు ఛాతిలో విపరీతమైన నొప్పి, ఎటువంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గిపోవడం, విపరీతమైన అలసట, వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Lung Cancer | భారత్‌లో పెరుగుతున్న ముప్పు:

ఇటీవల కాలంలో యువతలో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ‘ది లాన్సెట్’ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్యలో భారత్ మూడవ స్థానంలో ఉంది. ఐసీఎంఆర్ (ICMR) గణాంకాల ప్రకారం, మన దేశంలో ప్రతి ఐదుగురు క్యాన్సర్ బాధితుల్లో ముగ్గురు మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యాధిని ముదిరిన తర్వాత గుర్తించడమే.

క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరంలో, ముఖ్యంగా వేళ్లు , గోళ్లలో ఎటువంటి అసాధారణ మార్పులు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి: Vastu Tortoise | ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే అదృష్టమేనా? వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి?

Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
Gift Nifty Gapdown | మార్కెట్‌లో యుద్ధభయాలు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
వాయు కాలుష్యంతో పురుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం: ఇందిరా ఐవీఎఫ్ పరిశోధనలో వెల్లడి
Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు
కాలుష్యం, వాతావరణ మార్పుల నుంచి కళ్లకు రక్షణ.. డాక్టర్ వివేక్ సింగ్ కీలక సూచనలు
TAGGED:cancer symptoms Indiaearly cancer detectionLung Cancerlung cancer symptomslung health warning signsnail changes healthnail clubbing signsoncology awarenessrespiratory disease symptoms
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Constitutional Amendment Bill Constitutional Amendment Bill | కేంద్రానికి బిగ్​ షాక్​.. వీగిపోయిన కీలక బిల్లులు
Next Article Earth Rotation Stop Earth Rotation Stop | భూమి ఒక్క సెకన్​ తిరగడం ఆగితే ఏం జరుగుతుందో తెలుసా!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?