Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Constitutional Amendment Bill | కేంద్రానికి బిగ్​ షాక్​.. వీగిపోయిన కీలక బిల్లులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Constitutional Amendment Bill | కేంద్రానికి బిగ్​ షాక్​.. వీగిపోయిన కీలక బిల్లులు

జాతీయం

Constitutional Amendment Bill | కేంద్రానికి బిగ్​ షాక్​.. వీగిపోయిన కీలక బిల్లులు

లోక్​సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి​ షాక్ తగిలింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 8:52 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Constitutional Amendment Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Constitutional Amendment Bill | కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు బిల్లులకు ఆమోదం లభించలేదు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్​సభలో వీగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి బిగ్​ షాక్​ తగిలింది.

Contents
  • Constitutional Amendment Bill | ప్రతిష్టాత్మకంగా..
    • Constitutional Amendment Bill | మెజారిటీ లేకపోవడంతో..
    • Constitutional Amendment Bill | వాటి పరిస్థితి ఏమిటి

కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ, మహిళా రిజర్వేషన్ (Women Reservations)​, డీలిమిటేషన్​ బిల్లులను లోక్​సభలో ప్రవేశ పెట్టింది. 2026 జన గణన ఆధారంగా మహిళా రిజర్వేషన్​ అమలు చేస్తామని తెలిపింది. అలాగే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచుతామని తెలిపింది. అయితే మహిళా రిజర్వేషన్​ బిల్లుకు మద్దతు తెలిపిన విపక్షాలు.. డీలిమిటేషన్​ బిల్లును వ్యతిరేకించాయి. ఇందులో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్​ జరగ్గా వీగిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు మొత్తం 528 ఓట్లు పోల్​ కాగా.. అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో వీగిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు మహిళా రిజర్వేషన్​ బిల్లు, డీలిమిటేషన్​తో లింక్​ ఉంది. దీంతో కేంద్రం ఆ​ బిల్లులపై ఓటింగ్​ నిర్వహించలేదు.

Constitutional Amendment Bill | ప్రతిష్టాత్మకంగా..

కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. బిల్లులపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు మద్దతు తెలపాలని ప్రధాని మోదీ అన్ని పార్టీలను కోరారు. అయినా కూడా విపక్షాలు ఏకతాటిపై నిలిచాయి. బిల్లు ఆమోదం పొందకుండా పక్కాగా వ్యవహరించాయి.

Constitutional Amendment Bill | మెజారిటీ లేకపోవడంతో..

ప్రస్తుతం బీజేపీ (BJP)కి సభలో పూర్తిస్థాయి మెజారిటీ లేదు. కూటమిలోని ఇతర పక్షాలతో కలిసి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందడం కష్టం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం వాటిని తీసుకురావడం గమనార్హం. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఎన్నికల వేళ ఆ బిల్లులను తీసుకు వచ్చింది. విపక్షాలు బిల్లులను అడ్డుకోవడంతో దానిని బీజేపీ ప్రచార అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. అయితే ఇతర బిల్లుల ఆమోదానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Constitutional Amendment Bill | వాటి పరిస్థితి ఏమిటి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు (One nation One Election), ఉమ్మడి పౌరస్మృతి (UCC) తీసుకు రావాలని కొంతకాలంగా యత్నిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న బలంలో అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. తాజాగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ఇప్పట్లో కేంద్రం ఆ బిల్లుల జోలికి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది.

దీనిని కూడా చదవండి : Excise CI Bribery Case | ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్​ సీఐ

Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
Karnataka Social Media Ban | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా బ్యాన్​.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్
Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ముగ్గురు నాయకుల సస్పెన్షన్
Beer Price Hike | కిక్కు దించుతున్న యుద్ధం.. బీర్ల ధరలు పెంపు తప్పదా..!
TAGGED:BJP Governmentconstitutional amendment billdelimitation billIndian Politicslegislative setbacklok sabha newsparliament votingwomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Power Supply Disruption | Power Supply Disruption | నగరంలో రేపు విద్యుత్​ సరఫరాలో అంతరాయం
Next Article Lung Cancer  Lung Cancer | చేతి గోళ్లు ఇలా మారుతున్నాయా.. అయితే డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?