అక్షరటుడే, వెబ్డెస్క్: TET 2026 Notification | తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారం చేపట్టిన తర్వాత ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తోంది. గతేడాది జూన్, నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా మరోసారి టెట్ పరీక్షల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
TET 2026 Notification | ఆన్లైన్లో దరఖాస్తులు
టెట్ పరీక్ష (TET Exam) కోసం అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 15 నుంచి 30 వరకు సీబీటీ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. 2025 నవంబర్లో వెలువడిన నోటిఫికేషన్ ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. అయితే 2026లో పరీక్ష కోసం ఇటీవల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా (Education Secretary Yogita Rana) అనుమతి ఇచ్చారు. దీంతో నోటిఫికేషన్ విడుదల అయింది.
TET 2026 Notification | రెండు పేపర్లు
టెట్ పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం పేపర్ –1, ఆరో తరగతి నుంచి 8 వ తరగతి ఉపాధ్యాఅర్హతకు పరీక్షకు పేపర్–2 ఉంటుంది. అభ్యర్థులు అర్హతను బట్టి ఒక పేపర్ లేదంటే రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ మొదటి వారంలో హాల్ టికెట్లు విడుదల అవుతాయి. జులైలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Government Job Dowry Fraud | కట్నం కోసం ప్రభుత్వ ఉద్యోగం పేరిట మోసం
