అక్షరటుడే, వెబ్డెస్క్: Women Empowerment Modi | మహిళా సాధికారిత లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. అభివృద్ధి ప్రయాణంలో అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. సోమవారం న్యూఢిల్లీ (New Delhi)లోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’లో ఆయన మాట్లాడారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లును “నారీ శక్తి” (Women’s Power)కి అంకితమైన ఒక చారిత్రక ముందడుగుగా ప్రధాని అభివర్ణించారు. 21వ శతాబ్దపు అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఒకదానిని దేశం తీసుకోబోతోందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం నారీ శక్తికి అంకితం అన్నారు. సామాజిక న్యాయాన్ని పాలనలోనూ, నిర్ణయాల రూపకల్పనలోనూ ఒక అంతర్భాగంగా మార్చేదిగా దీనిని అభివర్ణించారు.
Women Empowerment Modi | గొప్ప సంకల్పం
మన పార్లమెంటు కొత్త చరిత్రను సృష్టించే దిశగా అడుగులు వేస్తోందని ప్రధాని అననారు. సామాజిక న్యాయం నినాదంగా కాకుండా, మన పని సంస్కృతిలోనూ, మన నిర్ణయాల రూపకల్పన ప్రక్రియలోనూ ఒక సహజ భాగంగా ఉండే, సమసమాజ భారతదేశం కోసం తీసుకున్న ఒక సంకల్పం ఇది అన్నారు. అసెంబ్లీల నుంచి పార్లమెంటు వరకు దశాబ్దాలుగా సాగిన నిరీక్షణకు తెరదెంచే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఆ కీలక ఘట్టం ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరగనుందన్నారు.
Women Empowerment Modi | నాలుగు దశాబ్దాలుగా
మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత దశాబ్దాలుగా అందరూ భావిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ చర్చ కొనసాగుతోందన్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల, అనేక తరాల కృషి ఉందని తెలిపారు. ప్రతి పార్టీ తనదైన రీతిలో ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Delhi Chief Minister Rekha Gupta), కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Noida Workers Protest | జీతాలు పెంచాలని కార్మికుల ఆందోళన.. నోయిడాలో ఉద్రిక్తత
