Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Govt Doctors Elections Telangana | ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Govt Doctors Elections Telangana | ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ

నిజామాబాద్

Govt Doctors Elections Telangana | ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ

తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ 2026-2028 ఎన్నికలకు కామారెడ్డి యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 13, 2026 1:24 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Govt Doctors Elections Telangana

అక్షరటుడే, కామారెడ్డి: Govt Doctors Elections Telangana | తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ 2026-2028 ఎన్నికలకు కామారెడ్డి (Kamareddy) యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) జారీ చేసింది. 2026 మార్చి 26 న జరిగిన కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం తీర్మానం ప్రకారం ఆఫీస్ బేరర్ పోస్టులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది.

Contents
  • Govt Doctors Elections Telangana | పోటీదారులు.. వారి అర్హతలు..
    • Govt Doctors Elections Telangana | ముగ్గురు సంయుక్త కార్యదర్శి పదవులకు..
      • Govt Doctors Elections Telangana | 20న స్ర్కూటినీ నిర్వహించి..

Govt Doctors Elections Telangana | పోటీదారులు.. వారి అర్హతలు..

అధ్యక్ష పదవికి సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్/అసోసియేట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్/అసోసియేట్ ప్రొఫెసర్ పోటీ చేయవచ్చు. అలాగే జనరల్ సెక్రెటరీ పదవికి డిప్యూటీ సివిల్ సర్జన్/అసోసియేట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్/అసోసియేట్ ప్రొఫెసర్, కోశాధికారి పదవికి సివిల్ అసిస్టెంట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోటీ చేయవచ్చని కమిటీ పేర్కొంది. ముగ్గురు జనరల్ కౌన్సిల్ సభ్యుల పదవులకు ఒక సివిల్ సర్జన్/ప్రొఫెసర్, ఒక డిప్యూటీ సివిల్ సర్జన్/అసోసియేట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ ప్రొఫెసర్/సివిల్ అసిస్టెంట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోటీ చేయవదచ్చు. ముగ్గురు ఉపాధ్యక్ష పదవులకు ఒక సివిల్ సర్జన్, ఒక డిప్యూటీ సివిల్ సర్జన్, ఒక మహిళా (సివిల్ అసిస్టెంట్ సర్జన్/ అసిస్టెంట్ ప్రొఫెసర్) అర్హులు.

Govt Doctors Elections Telangana | ముగ్గురు సంయుక్త కార్యదర్శి పదవులకు..

ముగ్గురు జాయింట్ సెక్రెటరీ పదవులకు ఒక సివిల్ సర్జన్/ప్రొఫెసర్, ఒక మహిళ(సివిల్ సర్జన్/అసిస్టెంట్ ప్రొఫెసర్), ఆరుగురు యూనిట్ ఎగ్జిక్యూటివ్ పదవులకు ఇద్దరు సివిల్ సర్జన్స్/ప్రొఫెసర్ (ఇందులో ఒకటి మహిళకు రిజర్వ్), నలుగురు డిప్యూటీ సివిల్ సర్జన్స్/అసోసియేట్ ప్రొఫెసర్స్/సివిల్ అసిస్టెంట్ సర్జన్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్(ఇందులో ఒకటి మహిళకు రిజర్వ్) పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డీసీహెచ్ఎస్ డా.విజయ భాస్కర్ వ్యవహరిస్తారని పేర్కొంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్స్ స్వీకరణ ఉంటుందని పేర్కొంది.

Govt Doctors Elections Telangana | 20న స్ర్కూటినీ నిర్వహించి..

20న స్ర్కూటినీ నిర్వహించి డిస్​ప్లే చేయడం జరుగుతుందని, 21న నామినేషన్ ఉపసంహరణ ఉంటుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈనెల 29న సాయంత్రం 4 గంటలకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుందని పేర్కొంది. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల్లో డీఎల్​వో, డీఐవో, డీసీటీవో/డీసీటీఎస్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్లు పోటీ చేయవచ్చని, డీఎంహెచ్​వో, డీసీహెచ్, ప్రిన్సిపాల్స్ టీచింగ్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్, కమిషనర్/జాయింట్ కమిషనర్ టీవీవీపీ, అడిషనల్ డైరెక్టర్స్ పోటీ చేయడానికి అనర్హులని స్పష్టం చేశారు.

అధ్యక్ష పదవికి పోటీ చేసేవారు కనీసం పదేళ్లు ప్రభుత్వ సేవలు చేసిన అనుభవం, జనరల్ సెక్రెటరీ పదవికి కనీసం ఐదేళ్ల అనుభవం, కోశాధికారి పదవికి ఐదేళ్లు, జీసీ మెంబర్లకు ఐదేళ్లు, ఉపాధ్యక్ష పదవికి ఐదేళ్లు, జాయింట్ సెక్రెటరీ పదవికి మూడేళ్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు రెండేళ్ల అనుభవం ఉండాలని, అభ్యర్థులను ప్రతిపాదించి, బలపరిచే వారికి కనీసం రెండేళ్ల సర్వీస్ అనుభవం ఉండాలని స్పష్టం చేసింది. అధ్యక్ష పదవికి పోటీ చేసే వారికి నామినేషన్ ఫీజు రూ.5 వేలు, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే వారికి రూ.2 వేలు నామినేషన్ ఫీజు చెల్లించాలని పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Arya Vysya Swearing Ceremony | శ్రీవాసవి గ్రేటర్ ​ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం

GGH Nizamabad | జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా నాగమోహన్​
RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం
Kamareddy Chairperson Election | కామారెడ్డి ఛైర్​పర్సన్​ ఎన్నిక చెల్లదు.. కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ కౌన్సిలర్​ అభ్యర్థి
Alur Gutpa Road | ఆలూర్​ నుంచి గుత్ప వరకు డబుల్​ రోడ్డు మంజూరు: ఎమ్మెల్యే రాకేశ్​​ రెడ్డి
Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలి..
TAGGED:doctors news telanganaElection Notificationgovernment doctors electionGovt Doctors Elections Telanganahealthcare staff electionsKamareddyKamareddy Newsnomination process
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article PCC Chief Comments PCC Chief Comments | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు పోటీ లేదు : పీసీసీ చీఫ్​
Next Article Government Job Dowry Fraud Government Job Dowry Fraud | కట్నం కోసం ప్రభుత్వ ఉద్యోగం పేరిట మోసం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?