అక్షరటుడే, వెబ్‌డెస్క్: PCC Chief Comments | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) తమకు ఎవరు పోటీ లేరని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా తామే అధికారంలోకి వస్తామన్నారు. సోమవారం ఆయన నిజామాబాద్ (Nizamabad)లో మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ (BRS)ను టీఆర్ఎస్గా మారుస్తామని ఆదివారం కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మహేశ్‌గౌడ్ స్పందించారు. BRSను TRSగా మార్చినా.. BJRSగా మారినా ఏమీ కాదన్నారు. ఆ పార్టీలు మళ్లీ మొలకెత్తే అవకాశం లేదని పేర్కొన్నారు. సింగరేణి సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. సింగరేణి (Singareni)లో ఒప్పందాలన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినవే అని స్పష్టం చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే స్వాగతిస్తామన్నారు.
PCC Chief Comments | గత ప్రభుత్వంలో దోపిడీ
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై మహేశ్‌గౌడ్ విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో ఆర్థిక దోపిడీ, భూ దోపిడీ జరిగిందన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. కేటీఆర్ (KTR) పాదయాత్రలో గత పదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందన్నారు.
PCC Chief Comments | కవిత పార్టీతో సంబంధం లేదు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha)తో తమకు సంబంధం లేదని పీసీసీ చీఫ్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని కవిత చెబుతున్నారని తెలిపారు. ఆస్తి తగదాలు, వాటాల్లో తగాదాలతో ఆమె బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఆమెతో కాంగ్రెస్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు వచ్చినా స్వాగతిస్తామన్నారు. కవిత పార్టీకి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఫండింగ్ చేస్తున్నారని ఎంపీ అర్వింద్ (MP Arvind) ఇటీవల ఆరోపించారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేయకుండా రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడిగే వారికి భవిష్యత్‌లో నూకలు చెల్లినట్లే అన్నారు.
ఇది కూడా చదవండి..: Constable Death | నీటి గుంతలో పడి కానిస్టేబుల్ మృతి
