Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Paresh Rawal IMF Comment | హోటల్ బిల్లు కట్టేదెవరు?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Paresh Rawal IMF Comment | హోటల్ బిల్లు కట్టేదెవరు?

అంతర్జాతీయం

Paresh Rawal IMF Comment | హోటల్ బిల్లు కట్టేదెవరు?

అమెరికా -ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ‘హోటల్ బిల్లులు ఎవరు కడతారు?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పరేష్ రావల్ ‘ఐఎంఎఫ్’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 5:14 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Paresh Rawal IMF Comment

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Paresh Rawal IMF Comment | పశ్చిమాసియాలో యుద్ధం ముగించే విషయమై పాకిస్థాన్‌లో 21 గంటలపాటు వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. దీనికి ఇస్లామాబాద్‌లోని అత్యంత భద్రత గల ప్రదేశాలలో ఒకటైన ఫైవ్ స్టార్ హోటల్ సెరీనా (Five-Star Hotel Serena) వేదికయ్యింది. ప్రధానమంత్రి నివాసం, పార్లమెంటుకు సమీపంలో హోటల్ ఉండటంతో దీనిని చర్చలకు అనువైనదిగా ఎంచుకున్నారు.

Contents
  • Paresh Rawal IMF Comment | కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతంగా మార్చారు
    • Paresh Rawal IMF Comment | ‘X’ పోస్ట్‌పై ఫన్నీ రెస్పాన్స్..

Paresh Rawal IMF Comment | కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతంగా మార్చారు

కాగా చర్చలకు ముందు ఇస్లామాబాద్‌ (Islamabad)ను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతంగా మార్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ఉన్నతాధికారుల నేతృత్వంలో ప్రతినిధి బృందాలు రావడంతో రెండు రోజుల పాటు దుకాణాలు, కార్యాలయాలను మూసివేశారు. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, దౌత్య కార్యాలయాలు ఉన్న రెడ్ జోన్‌తో సహా కీలక ప్రాంతాల్లో పారామిలిటరీ, సైనిక దళాలతో సహా వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అయితే ఈ చర్చలు ఫలప్రదం కాలేదు. ఇందులో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Paresh Rawal IMF Comment | ‘X’ పోస్ట్‌పై ఫన్నీ రెస్పాన్స్..

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉన్నత స్థాయి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వడం గురించి వైరల్ అయిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌పై బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ (Actor Paresh Rawal) తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. ఇస్లామాబాద్‌లో ప్రపంచ నాయకులకు వసతి కల్పించే ఖర్చు గురించి ఒక ఎక్స్ యూజర్ “ఇప్పుడు అతిపెద్ద సందిగ్ధత… హోటల్ బిల్లులు ఎవరు కడతారు?” అన్న పోస్టుపై ఆయన స్పందిస్తూ ఐఎంఎఫ్ అని రాశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధిపై పాకిస్థాన్ దీర్ఘకాలంగా ఆధారపడి ఉందన్న విషయాన్ని సూచిస్తూ ఆయన రాసిన ‘ఐఎంఎఫ్’ అన్న రిప్లై వైరల్ అవుతోంది. పాకిస్తాన్ (Pakistan) తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించుకోవడానికి చాలాకాలంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మద్దతుపై ఆధారపడి ఉన్నందున, రావల్ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఇది కూడా చదవండి..: Iran US Tensions | గల్ఫ్​ దేశాల్లోని పోర్టులను మూసేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!
Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం
Hormuz LPG tanker | హార్మూజ్ దాటిన మరో నౌక.. 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో వస్తున్న ‘గ్రీన్ సాన్వి’
Strait of Hormuz Oil | హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతతో 110 డాలర్లకు చమురు ధర!
TAGGED:Actor Paresh Rawalbollywood reactionsFive-Star Hotel Serenaglobal politicsIslamabadPakistanpakistan newsParesh Rawal IMF Commentsocial media buzzviral tweet india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Drinking Water Facility | Drinking Water Facility | కిషన్​గంజ్​లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు అభినందనీయం : ఎమ్మెల్యే ధన్​పాల్​
Next Article Revanth Reddy Delimitation Revanth Reddy | డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?