అక్షరటుడే, ఇందూరు: Drinking Water Facility | గ్రామీణులు, కూలీల సౌకర్యార్థం నీటి వసతిని కల్పించడం సంతోషకరమని అర్బన్ (Nizamabad City) ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) తెలిపారు. ది కిషన్ గంజ్ మర్చంట్ అసోసియేషన్ (Kishanganj Merchant Association) ఆధ్వర్యంలో సోమవారం గంజ్‌లో వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కిషన్‌గంజ్‌కు (Kishan Ganj news) జిల్లా వ్యాప్తంగా అనేకమంది నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తుంటారన్నారు.
Drinking Water Facility | త్వరలోనే కిషన్ గంజ్‌లో సీసీ రోడ్డు నిర్మాణం..
వేసవిలో వారి సౌకర్యార్థం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధన్పాల్ అన్నారు. అలాగే వ్యాపార కేంద్రాల్లో అనేక మంది కూలీలు పనిచేస్తుంటారని, వారందరూ తాగునీటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణంలో తన ట్రస్ట్ ద్వారా సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే త్వరలోనే కిషన్ గంజ్‌లో సీసీ రోడ్డు వేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందూరు అభివృద్ధి తన లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, మర్చంట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కోలా రామ్, అధ్యక్షుడు నేతి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అనంపల్లి చందు, కోశాధికారి వినోద్, హమాలీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
