అక్షరటుడే, కామారెడ్డి: Fire Safety Week | కామారెడ్డిలో (Kamareddy news) వారంరోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫైర్ స్టేషన్ (Kamareddy Fire station) అధికారి సుధాకర్ తెలిపారు. సోమవారం అగ్నిమాపక కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘Safe school.. safe hospital.. fire safety aware society..Together fire preventation నినాదంతో ఈ ఏడాది వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Fire Safety Week | 14న అమరులైన అగ్నిమాపక సిబ్బందికి శ్రద్ధాంజలి..
ఈనెల 14న ఉదయం అమరులైన అగ్నిమాపక సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటిస్తామని, అగ్నిమాపక కేంద్రంలో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 15న ఉదయం 7 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం (Indira Gandhi Stadium) నుంచి 3కే రన్ ఉంటుందని, 16న ఎల్పీజీ గోడౌన్, అపార్టుమెంట్ల వద్ద అవగాహన ఉంటుందని తెలిపారు. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 17న జీవదాన్ పాఠశాలలో ఫైర్ సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. 18న ఇండస్ట్రీస్, అపార్ట్మెంట్స్ వద్ద సెమినార్ ఏర్పాటు చేస్తామని, సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 19న విద్యాసంస్థలు, ప్రియ థియేటర్ రోడ్డులో ఫైర్ విన్యాసాలు(emergency services) ప్రదర్శించడం జరుగుతుందన్నారు. 20న ముగింపు, పరేడ్ ఉంటుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Land Survey Rovers | రోవర్లతో పక్కాగా భూ సర్వే.. మంత్రి పొంగులేటి
