అక్షరటుడే, బాన్సువాడ: Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ (Indiramma Housing Scheme) పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Indiramma Houses Construction | లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలి..
ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ (Agros Industries) ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi), నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పనులు నెమ్మదిగా జరుగుతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులతో నేరుగా సంప్రదించి సమస్యలను గుర్తించి, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.
అలాగే బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రతి దశలో బాధ్యతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. జూన్ నెలాఖరు నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుని, లబ్ధిదారులతో గృహప్రవేశాలు నిర్వహించేలా చూడాలని సూచించారు. ఏవైనా కారణాల వల్ల ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులను సంప్రదించి, వారిని ప్రోత్సహిస్తూ త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇది కూడా చదవండి: Multi Level Scam | మరో ‘మల్టీ లెవల్’ స్కాం.. రూ.800 కోట్ల మోసం
