అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTC strike Telangana | తెలంగాణ ఆర్టీసీ (TGS RTC)లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు (RTC strike Telangana) మార్చి 13న యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. నెల క్రితం నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం, సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదని జేఏసీ నేతలు తెలిపారు. దీంతో ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ ఏరియర్స్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని కార్మికులు కోరుతున్నారు. వేతనాల పెంపు ఇతర విషయాల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు.
RTC strike Telangana | 32 డిమాండ్లు
ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని జేఏసీ నాయకులు కోరారు. తాము ప్రభుత్వం ముందు 32 డిమాండ్లు పెట్టినట్లు జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టెలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి : TET 2026 Notification | తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..
