అక్షరటుడే, కామారెడ్డి: SSC Exams Completed | జిల్లావ్యాప్తంగా పదవ తరగతి(SSC exams) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో చివరిరోజు సోషల్ పరీక్షలకు 13,143 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13110 మంది విద్యార్థులు హాజరయ్యారు. 33 మంది గైర్హాజరయ్యారు.
SSC Exams Completed | బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చరిత్రలో..
చివరిరోజు హాజరు శాతం 99.75% నమోదైంది. గతనెల 14న మొదలైన పదోతరగతి పరీక్షలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Board of Secondary Education) చరిత్రలో నెలరోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఒక్కో పరీక్షలు గతంలో ఎన్నడూ లేని విధంగా 5 రోజుల పాటు విరామం రావడం, ఆ గ్యాప్లో పరీక్షల మూల్యాంకనం కూడా పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి సారిగా మూల్యాంకనం కేంద్రాన్ని జీవదాన్ పాఠశాలలో (Jeevadhan School) ఏర్పాటు చేశారు. ఈనెల చివరి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
SSC Exams Completed | పెద్దకొడప్గల్లో..
అక్షరటుడే, పెద్దకొడప్గల్: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. మండలంలో ఆఖరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్షలకు 240 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 238మంది హాజరయ్యారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు సీఎస్ రాందాస్ తెలిపారు. గతనెల 14న మొదలైన పదవ తరగతి పరీక్షలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగాయి.

