అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Police Prajavani Complaints | నగరంలోని పోలీస్ ప్రజావాణిలో (Police Prajavani) 24 ఫిర్యాదులు స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya IPS) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి వివరాలు వెల్లడించారు.
Police Prajavani Complaints | నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పోలీస్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని సీపీ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడిన ఆయన సంబంధిత పోలీస్స్టేషన్ల ఎస్సై, సీఐలకు నేరుగా ఫోన్ చేసి చట్టపరమైన పరిష్కారాన్ని చూపాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని సీపీ తెలియజేశారు. ప్రజా సమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: RTC strike Telangana | ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
