Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Praful Hinge | నాలుగు వికెట్లు తీసి రాజ‌స్థాన్ ఓట‌మిని శాసించిన ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్.. అప్పుడు లెద‌ర్ బాల్ అంటే కూడా తెలియ‌ద‌ట‌..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Praful Hinge | నాలుగు వికెట్లు తీసి రాజ‌స్థాన్ ఓట‌మిని శాసించిన ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్.. అప్పుడు లెద‌ర్ బాల్ అంటే కూడా తెలియ‌ద‌ట‌..

క్రీడలు

Praful Hinge | నాలుగు వికెట్లు తీసి రాజ‌స్థాన్ ఓట‌మిని శాసించిన ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్.. అప్పుడు లెద‌ర్ బాల్ అంటే కూడా తెలియ‌ద‌ట‌..

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో ప్రఫుల్ హింగే అదరగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 8:31 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Praful Hinge

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Praful Hinge | ఐపీఎల్ వేదికగా మరో కొత్త స్టార్ వెలుగులోకి వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసిన యువ పేసర్ ప్రఫుల్ హింగే (Praful Hinge) అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ లాంటి పటిష్ట జట్టును కేవలం తన బౌలింగ్‌తో కుదేలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేధించడం రాజస్థాన్‌కు పెద్ద సవాలు కాదనిపించినా.. ప్రఫుల్ హింగే బౌలింగ్‌తో మ్యాచ్ మలుపుతిరిగింది.

Contents
  • Praful Hinge | వ‌ణికించాడు..
    • Praful Hinge | 13 ఏళ్ల వయసులో..

Praful Hinge | వ‌ణికించాడు..

ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేయడానికి వచ్చిన హింగే, మొదటి బంతికే ప్రమాదకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఔట్ చేశాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతికి ధ్రువ్ జురెల్​ను కూడా డకౌట్ చేయడంతో రాజస్థాన్​కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. అనంతరం లూయాన్-డ్రే ప్రిటోరియస్, రియాన్ పరాగ్ (Riyan Parag) వికెట్లు కూడా పడగొట్టి మొత్తం 4 వికెట్లతో రాజస్థాన్ పతనానికి కారకుడయ్యాడు. ఫలితంగా సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న హింగే తన భావోద్వేగాలను పంచుకున్నాడు. “నా అరంగేట్ర మ్యాచ్‌లోనే 4 నుంచి 5 వికెట్లు తీయాలని నేను ముందే నా డైరీలో రాసుకున్నాను. గట్టిగా నమ్మితే ఏదైనా సాధ్యమే. పవర్‌ప్లేలో బ్యాటర్లపై ఒత్తిడి తేవాలని ప్లాన్ చేశాను. వైభవ్‌ను బౌన్సర్‌తో ఔట్ చేస్తానని ముందే చెప్పాను. మా బౌలింగ్ కోచ్ సహాయంతో ఆ ప్లాన్ సక్సెస్ అయింది” అని తెలిపాడు.

Praful Hinge | 13 ఏళ్ల వయసులో..

ప్రఫుల్ ప్రయాణం కూడా చాలా ప్రేరణాత్మకంగా ఉంది. చిన్నతనంలో క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, కేవలం 13 ఏళ్ల వయసులో ఆట మొదలుపెట్టాడు. ఆ స‌మ‌యంలో అతనికి లెద‌ర్ బాల్ అంటే ఏంటో కూడా తెలియ‌ద‌ట‌. మొదట తన తండ్రి క్లబ్‌లో చేర్పించడానికి నిరాకరించినా, తర్వాత ప్రోత్సహించడంతో అతని కెరీర్ మలుపుతిరిగింది. “నా తండ్రే నేను ఈ స్థాయికి రావడానికి కారణం. ఈ అవార్డును Award నా కుటుంబానికి అంకితం చేస్తున్నాను” అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విజయం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ముఖ్యంగా కొత్త ఆటగాళ్ల ప్రతిభ జట్టుకు బలంగా మారుతుందని ఈ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది.

ఇది కూడా చదవండి..: Praful Hinge SRH | తొలి ఓవర్​లోనే మూడు వికెట్లు.. యువ బౌలర్​ ప్రఫుల్​ సంచలనం!

T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మ‌ధ్య టైటిల్ పోరు
T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
IPL 2026 Gloves Issue | చెన్నై తొలి విజయం.. హాట్ టాపిక్​గా మారిన స్టబ్స్ గ్లోవ్స్ వివాదం
South Africa vs New Zealand | ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్ సమరం.. 19 ఏళ్ల పగకు ముగింపు పలుకుతారా?
T20 World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ తో ఫైట్.. పాత ట్రెండ్‌ని బ‌ట్టి ప్రపంచకప్ విజేతగా భారత్.. ?
TAGGED:Cricket NewsIPL 2026ipl debut starpraful hingeriyan paragsrh vs rrsunrisers hyderabadyoung cricketers india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Rate April 14 Gold Rate April 14 | అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు
Next Article Hormuz Strait Tensions Hormuz Strait Tensions | హర్మూజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు.. భారత్‌కు ఇరాన్ భరోసా, అమెరికాపై తీవ్ర విమర్శలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?