అక్షరటుడే, హైదరాబాద్: Gold Rate Protection | అక్షయ తృతీయ (Akshaya Tritiya) పర్వదినాన బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల హెచ్చుతగ్గుల భయం లేకుండా ఇన్‌స్టామార్ట్ కళ్యాణ్ జువెలర్స్ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా క్విక్ కామర్స్ రంగంలో ‘గోల్డ్ రేట్ ప్రొటెక్షన్’ అనే వినూత్న ఫీచర్‌ను ఇన్‌స్టామార్ట్ ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు నేటి తక్కువ ధరకే బంగారాన్ని లాక్ చేసుకుని, అక్షయ తృతీయ రోజున డెలివరీ పొందవచ్చు.
Gold Rate Protection | బంగారం ధరల్లో మార్పులు వస్తున్న తరుణంలో
బంగారం ధరల్లో నిత్యం మార్పులు వస్తున్న తరుణంలో, వినియోగదారులకు భరోసా కల్పించడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశ్యం. దీని ప్రకారం, ఏప్రిల్ 10 నుండి 16వ తేదీ మధ్యలో వినియోగదారులు ఇన్‌స్టామార్ట్ యాప్‌లో కళ్యాణ్ జువెలర్స్ (Kalyan Jewellers) గోల్డ్ కాయిన్స్‌ను ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. కేవలం 5 శాతం అడ్వాన్స్ (0.5 గ్రాములకు రూ. 500 నుండి ప్రారంభం) చెల్లించి ధరను లాక్ చేయవచ్చు. ఏప్రిల్ 19 అక్షయ తృతీయ నాడు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య మిగిలిన మొత్తాన్ని చెల్లించి డెలివరీ తీసుకోవాలి. ఇక్కడ విశేషమేమిటంటే, బుకింగ్ నాటి ధర లేదా డెలివరీ నాటి ధర.. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే ఆ ధరకే బంగారం లభిస్తుంది.
Gold Rate Protection | ఒక వెండి నాణెం ఉచితం
అంతేకాకుండా, ఈ పద్ధతిలో ప్రీబుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ కళ్యాణ్ జువెలర్స్ నుండి ఒక వెండి నాణెం ఉచితంగా అందజేయనున్నారు. ఇన్‌స్టామార్ట్ వీపీ అర్జున్ చౌదరి (Instamart VP Arjun Choudhary) మాట్లాడుతూ, తమ ప్లాట్‌ఫారమ్ కేవలం నిత్యావసరాలకే పరిమితం కాకుండా, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న విలువైన వస్తువులను కూడా నమ్మకంతో అందిస్తోందని తెలిపారు. గతేడాది అక్షయ తృతీయ సమయంలో అమ్మకాలు 500 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
కళ్యాణ్ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, తమ షోరూమ్‌లలో విజయవంతమైన ఈ గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ఇప్పుడు ఇన్‌స్టామార్ట్ ద్వారా డిజిటల్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఆఫర్ కింద లభించే అన్ని నాణేలు 24 క్యారెట్ బీఐఎస్ హాల్‌మార్క్ (BIS Hallmark) గుర్తింపు పొందినవి. స్టాక్ లభ్యత నిబంధనల మేరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..: Gold Rate April 14 | అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు
