అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy black spots | రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (State DGP Shivadhar Reddy) మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ స్టేజి వద్ద డీజీపీకి ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి స్వాగతం పలికారు.
Kamareddy black spots | కుప్రియాల్ వద్ద..
కుప్రియాల్ (Kupriyal) వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు బ్లాక్ స్పాట్‌గా గుర్తించారు. సంబంధిత బ్లాక్ స్పాట్‌ను డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదాలు జరిగే తీరు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ (Police Department) తీసుకున్న చర్యలకు ఎస్పీ రాజేష్ చంద్ర డీజీపీకి వివరించారు. బ్లాక్ స్పాట్ గుర్తించిన తర్వాత ప్రమాదాల సంఖ్య తగ్గిందని, కేవలం 5 ప్రమాదాలు మాత్రమే జరిగినట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ప్రమాదాలను తగ్గించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Telangana Public School | తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలపరిశీలన
