Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Iran talks | అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధం.. ఉద్రిక్తతల మధ్య శాంతి ప్రయత్నాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - US Iran talks | అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధం.. ఉద్రిక్తతల మధ్య శాంతి ప్రయత్నాలు

అంతర్జాతీయం

US Iran talks | అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధం.. ఉద్రిక్తతల మధ్య శాంతి ప్రయత్నాలు

ఇస్లామాబాద్‌లో తొలి దశ చర్చలు విఫలమైనప్పటికీ, అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ గడువు ముగియకముందే ఈ చర్చలు కీలకంగా మారనున్నాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 2:41 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
US Iran talks

అక్షరటుడే, వెబ్​డెస్క్: US Iran talks | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా (America) మరియు ఇరాన్ మధ్య మరోసారి చర్చల ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. ఇటీవల ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా జరిగిన తొలి విడత చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రెండో విడత చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు ముందుకు వస్తున్నాయని సమాచారం.

Contents
  • US Iran talks | జెనీవా వేదిక‌గా..
    • US Iran talks |ఈ పరిస్థితుల్లో

అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, గురువారం ఈ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని, చర్చల తేదీ, వేదికపై తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సున్నితమైన అంశం కావడంతో వివరాలు వెల్లడించకుండా అమెరికా అధికారులు, ఒక దౌత్యవేత్త ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

US Iran talks | జెనీవా వేదిక‌గా..

ఈ చర్చలు జరుగుతున్న సమయంలో, గత వారం ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ఇంకా ముగియలేదు. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలు మళ్లీ ప్రారంభమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండో విడత చర్చలు కూడా ఇస్లామాబాద్‌లోనే  జరిగే అవకాశమున్నప్పటికీ, ప్రత్యామ్నాయంగా జెనీవా వేదికగా కూడా నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి చర్చల్లో పాల్గొనే ప్రతినిధి బృందాల స్థాయి, వారి అజెండా వంటి అంశాలు ఇంకా స్పష్టతకు రాలేదు. తొలి విడతలో ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనగా, రెండో దశలో కూడా అదే స్థాయి పాల్గొనుతారా అనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

US Iran talks |ఈ పరిస్థితుల్లో

ఇదిలా ఉండగా, డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చలకు మరింత ప్రాధాన్యతను తెచ్చాయి. “మరో పక్షం నుంచి మాకు కాల్ వచ్చింది. వారు ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు” అని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య చర్చలు ముందుకు సాగుతున్నాయనే సంకేతాలను ఇస్తున్నాయి. గతంలో ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్తో కలిసి అమెరికా, ఇరాన్‌పై దాడులు చేపట్టగా, అనంతరం ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు జరగడంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని నివారించేందుకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి విడత చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో ఒప్పందం దిశగా ముందడుగు పడలేదు. చర్చల వైఫల్యానికి ఇరుదేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత చర్చల ప్రయత్నాలు విజయవంతమైతే, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశముంది. లేనిపక్షంలో పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: US Iran Nuclear Talks | బాల్ ఇప్పుడు వారి కోర్టులోనే ఉంది..: జేడీ వాన్స్​

Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన
US Iran Conflict | ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తాం : అమెరికా
Hormuz LPG tanker | హార్మూజ్ దాటిన మరో నౌక.. 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో వస్తున్న ‘గ్రీన్ సాన్వి’
Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం
Trump Modi Call | మోదీకి ఫోన్​ చేసిన ట్రంప్​.. హర్ముజ్​ జలసంధిపై చర్చ
TAGGED:ceasefire talksDonald Trumpgeopoliticsglobal diplomacyIran conflictMiddle East tensionsnuclear negotiationsus iran talks
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy black spots Kamareddy black spots | కామారెడ్డిలో బ్లాక్ స్పాట్స్​ను పరిశీలించిన డీజీపీ
Next Article Fire Service Week Fire Service Week | అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?