అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gopalpet Bus Stand | ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని (Yellareddy Constituency) గోపాల్పేట్ బస్టాండ్‌ను రూ. 40లక్షలతో పునర్నిర్మించామని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బస్టాండ్‌ను ప్రారంభించారు.
Gopalpet Bus Stand | ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై..
గోపాల్పేట్ బస్టాండ్ ఏళ్ల తరబడి కొనసాగిన నిర్లక్ష్యానికి గురైందని.. శిథిలావస్థలో చేరి.. ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన ఈ బస్టాండ్‌ను రూ.40 లక్షల వ్యయంతో పునర్నర్మించామని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటివరకు బస్టాండ్ దయనీయ స్థితిలో ఉండడంతో, ప్రయాణికులు చెట్ల కింద ఎండలో నిలబడి, వర్షంలో తడుస్తూ బస్సుల కోసం వేచి ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. సమస్యపై పలుమార్లు వినతులు ఇచ్చినా గత ప్రభుత్వాలు, అధికారులు స్పందించకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చాక వెంటనే బస్టాండ్‌కు మరమ్మతులు చేపట్టామని చెప్పారు. పలుమార్లు రవాణా శాఖ మంత్రిని కలిసి నిధుల కోసం ఒత్తిడి తెచ్చి, చివరకు రూ.40 లక్షల నిధులను మంజూరు చేయించామని.. ఆ నిధులతో పాత బస్‌స్టాండ్‌ను పూర్తిగా మరమ్మతులు చేసి, ఆధునిక సదుపాయాలతో కొత్త రూపంలో నిర్మించామన్నారు.
ఇది కూడా చదవండి..: Banswada Post Office Attack | పోస్ట్ ఆఫీస్‌పై దొంగల దాడి.. బాన్సువాడలో కలకలం రేపిన ఘటన..
