అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ponnam Prabhakar Visit | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ (Transport Department) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister ponnam prabhakar) జిల్లాకు రానున్నారు. ఆదిలాబాద్‌లో జరిగే పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని బుధవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.
Ponnam Prabhakar Visit | పలు అభివృద్ధి కార్యక్రమాల్లో..
కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముందుగా నగరంలో హెల్మెట్ ర్యాలీ, మానవహారం కార్యక్రమాల్లో (road safety campaign) మంత్రి పాల్గొననున్నారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ హెల్త్ క్యాంప్‌ను (health camp) ప్రారంభిస్తారు. రోడ్డు ప్రమాదాల్లో నష్టపోయిన బాధిత కుటుంబీకులతో మాట్లాడతారు. రోడ్డు ప్రమాదాలు లేకుండా బస్సులు నడిపిన ఆర్టీసీ డ్రైవర్లకు (rtc drivers) సన్మానం, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంత్రి జిల్లా పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇది కూడా చదవండి: Fake Goodknight Refills | హైదరాబాద్‌లో నకిలీ గుడ్‌నైట్ దందా ఖేల్ ఖతం
