అక్షరటుడే, హైదరాబాద్: Fake Goodknight Refills | సిటీలో నకిలీ ఉత్పత్తుల ముఠా ఆగడాలకు పోలీసులు బ్రేక్ వేశారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ వస్తువులను అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాలపై తెలంగాణ పోలీసులు (Telangana Police) కొరడా ఝుళిపించారు. ముఖ్యంగా దోమల నివారణకు వాడే ‘గుడ్‌నైట్’ పేరుతో చలామణీ అవుతున్న డూప్లికేట్ రీఫిల్స్ విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించి భారీ స్కామ్‌ను బయటపెట్టారు.
Fake Goodknight Refills | జాంబాగ్‌లో మెరుపు దాడి
నగరంలోని జాంబాగ్‌లో నకిలీ ఉత్పత్తులు నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో పోలీసులు, గుడ్‌నైట్ మాతృ సంస్థ ‘గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (GCPL) ప్రతినిధులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఒక హోల్‌సేల్ సెంటర్‌లో తనిఖీలు చేయగా, సుమారు 3,600 నకిలీ గుడ్‌నైట్ లిక్విడ్ వేపరైజర్ రీఫిల్స్ బయటపడ్డాయి. అధికారులు వీటిని వెంటనే స్వాధీనం చేసుకున్నారు.
Fake Goodknight Refills | కేసు నమోదు.. నెట్‌వర్క్‌పై ఆరా
ఈ అక్రమ దందాకు పాల్పడిన నిందితులపై కాపీరైట్ చట్టం భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నకిలీ మాల్ ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరెవరికి సప్లై చేస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలకు ఉన్న లింకులను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
Fake Goodknight Refills | సంస్థ హెచ్చరిక..
నకిలీ ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని గోద్రెజ్ కంపెనీ (Godrej Company) ప్రతినిధి అశ్విన్ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. క్వాలిటీ లేని కెమికల్స్‌తో తయారు చేసే ఇలాంటి వస్తువుల పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. వస్తువులు కొనేటప్పుడు అసలైన సేల్స్ బిల్లు (Invoice) తప్పనిసరిగా తీసుకోండి. నకిలీ ఉత్పత్తుల గురించి సమాచారం ఉంటే 1800-266-0007 నంబర్‌కు కాల్ చేయండి.
ఇది కూడా చదవండి..: Food Adulteration | కల్తీ మాఫియాకు సీపీ సజ్జనార్ వార్నింగ్
