అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mandal Sabha Arrangements | ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 16న మండల కేంద్రాలు, మున్సిపల్ పట్టణాలలో నిర్వహించనున్న సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు మంగళవారం పలు సూచనలు చేశారు.
Mandal Sabha Arrangements | సభా వేదికలను సందర్శించాలి
ముందస్తుగానే సభా వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లతో, ఇతర మండలస్థాయి అధికారులతో సమావేశమై తగు సూచనలు చేయాలన్నారు. సభలు నిర్వహించే ప్రదేశాలలో తగిన నీడ, తాగునీరు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 8గంటల నుంచి 10.30 గంటల్లోపు సభలు ముగిసేలా ప్రణాళిక రూపొందించూసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సభల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలు చదివి వినిపించాలని, లబ్ధిదారులతో వారి అనుభవాలను తెలియజేసేలా చూడాలన్నారు.
Mandal Sabha Arrangements | రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు..
రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి వాటికి సంబంధించి గ్రామ సభల్లో వచ్చిన అర్జీలను మండల సభలకు ముందు తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సభలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, అందరూ భాగస్వాములు అయ్యేలా చొరవ చూపాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్-అలైవ్ (Arrive Alive) కార్యక్రమం గురించి సభల్లో తెలియజేయాలని అన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సభల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో(Sub-Collector Vikas Mahato), అభిగ్యాన్ మాల్వియా (Sub-Collector Abhigyan Malviya), జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Hindu Sammelan | హిందూ ధర్మాన్ని ఆచరించడమే అన్ని సమస్యలకు పరిష్కారం: అయాచితుల లక్ష్మణరావు
