Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Modi Call | మోదీకి ఫోన్​ చేసిన ట్రంప్​.. హర్ముజ్​ జలసంధిపై చర్చ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Modi Call | మోదీకి ఫోన్​ చేసిన ట్రంప్​.. హర్ముజ్​ జలసంధిపై చర్చ

అంతర్జాతీయం

Trump Modi Call | మోదీకి ఫోన్​ చేసిన ట్రంప్​.. హర్ముజ్​ జలసంధిపై చర్చ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ ప్రధాని మోదీకి ఫోన్​ చేశారు. ఇరుదేశాల అధినేతలు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 8:42 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Trump Modi Call

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Modi Call | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ (Donald Trump) ప్రధాని మోదీకి ఫోన్​ చేశారు. ఇరుదేశాల అధినేతలు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత మధ్యప్రాచ్య పరిస్థితి, ద్వైపాక్షిక సహకారంపై వీరు చర్చించారు.

హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ఇద్దరు నేతలు నొక్కి చెప్పారు. ట్రంప్​ కాల్​ అనంతరం మోదీ (PM Modi) ఎక్స్​ వేదికగా స్పందించారు. “నా మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది” అని పేర్కొన్నారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించామన్నారు. అన్ని రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Trump Modi Call | సురక్షితంగా ఉంచాలి

పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై కూడా చర్చించినట్లు ప్రధాని తెలిపారు. హర్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచాలన్నారు. ఇద్దరు నేతల మధ్య సంభాషణ జరిగిన వెంటనే, అధ్యక్షుడు ప్రధానికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటారని భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.మధ్యప్రాచ్యంలో ఏమి జరుగుతోందనే దానిపై, అలాగే వాషింగ్టన్‌లో అమెరికా, భారత్ మధ్య జరుగుతున్న కొన్ని కీలక అంశాలపై అధ్యక్షుడు తాజా సమాచారం అందించారు అని చెప్పారు.

కాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్​, అమెరికా మధ్య సీజ్​ఫైర్​ అమలులోకి వచ్చిన చర్చలు విఫలం కావడంతో ఆందోళన నెలకొంది. హర్ముజ్​ జలసంధిపై ఇరాన్​, అమెరికా వ్యాఖ్యలతో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ట్రంప్​, మోదీకి ఫోన్ (Trump Modi Call )​ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…

— Narendra Modi (@narendramodi) April 14, 2026

దీనిని కూడా చదవండి : US Iran talks | అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధం.. ఉద్రిక్తతల మధ్య శాంతి ప్రయత్నాలు

Iran Dubai Doha Attacks | దుబాయ్, దోహాలపై ఇరాన్ దాడులు.. ఆందోళనకరంగా పరిస్థితి
Pakistan Kabul Airstrike | అఫ్గానిస్థాన్​పై పాక్​ దాడి పిరికిపంద చర్య : భారత్‌
Iran Israel Conflict | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
Padma River Bus Accident | ఘోర విషాదం.. పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు 23 మంది దుర్మరణం!
Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
TAGGED:Donald Trump newsHormuz Straitindia us relationsMiddle East CrisisNarendra Modi updatesTrump Modi call
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Lok Sabha Seats Increase Lok Sabha Seats Increase | లోక్​సభ సీట్ల పెంపుపై ప్రధానికి సీఎం లేఖ
Next Article Lungs Health Exercises Lungs Health Exercises | శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా.. లంగ్స్ ప్రమాదంలో ఉన్నాయేమో.. ఇలా చేయండి!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?