అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amravati Incident | మహారాష్ట్ర (Maharashtra)లోని అమరావతిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దాడులు, అశ్లీల వీడియోలు చిత్రీకరణ, బ్లాక్‌మెయిల్ వంటి తీవ్రమైన ఆరోపణలతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం, పరాత్‌వాడ (Paratwada)కు చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే వ్యక్తి ఈ దారుణాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా (Social Media) వేదికలు అయిన వాట్సాప్, స్నాప్‌చాట్ ద్వారా మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని, ప్రేమ పేరుతో వారిని తన వలలోకి దింపేవాడని విచారణలో తేలింది.
Amravati Incident | వందలాది వీడియోలు ..
ఆ తరువాత వారిని నమ్మించి ముంబై, పుణే వంటి నగరాలకు తీసుకెళ్లి అభ్యంతరకర వీడియోలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని బాధితులను బ్లాక్‌మెయిల్ చేస్తూ, మరింతగా వేధింపులకు గురి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సుమారు 180 మందికి పైగా బాలికలు బాధితులుగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అలాగే 350కి పైగా అభ్యంతరకర వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసారేమో అనే అనుమానంతో సైబర్ విభాగం (Cyber Division) దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో అనేక వీడియోలు, డేటాను గుర్తించారు. ఈ వీడియోలను ఇతరులకు పంపించాడా? లేక ఏదైనా ముఠాతో సంబంధం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
Amravati Incident | ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
ఈ ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బోండే స్పందిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ విశాల్ ఆనంద్ (SP Vishal Anand)కు మెమోరాండం సమర్పించి, కేసును తీవ్రంగా విచారించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముస్లిం సమాజానికి చెందిన కొందరు కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు సమాజానికి చెడ్డపేరు తీసుకువస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు గతంలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్కు అనుబంధంగా పనిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పార్టీ నాయకులతో ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ కేసు బయటకు వచ్చిన తరువాత అతని సోషల్ మీడియా ఖాతాల్లోని పలు వీడియోలు తొలగించనట్లు తెలుస్తోంది.
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి..: India Forex Reserves | పెరిగిన ఫారెక్స్ నిల్వలు
