అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Inter Results | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Education Minister Nara Lokesh) బుధవారం ఉదయం ఫలితాలను రిలీజ్ చేశారు.
ఇంటర్ ఫస్టియర్‌లో 77శాతం, సెకండియర్‌లో 81 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు. అలాగే వాట్సప్‌లోనూ (9552300009) ఈ ఫలితాలు పొందొచ్చని మంత్రి పేర్కొన్నారు.
AP Inter Results | 10.5 లక్షల మంది విద్యార్థులు
ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. మొత్తం దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఫెయిల్ అయిన వారు నిరుత్సాహ పడొద్దని.. మళ్లీ పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు.
AP Inter Results | ప్రభుత్వ కాలేజీల్లో..
గత 12 ఏళ్లలో ఈ సారి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ విద్యార్థులు 54శాతం పాస్ అయ్యారని చెప్పారు. గత 12 ఏళ్లలో ఇది అత్యధికం అన్నారు. సెకండియర్‌లో ఉత్తీర్ణత 68 శాతంగా ఉందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Thota Chandrasekhar | పవన్ కళ్యాణ్‌తో తోట చంద్రశేఖర్ ప్రత్యేక భేటీ.. మళ్లీ జనసేనలోకి వెళ్తారా!
