Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hostel Student Death | బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hostel Student Death | బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని మృతి

నిజామాబాద్

Hostel Student Death | బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని మృతి

వసతి గృహంలో విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 15, 2026 11:31 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Hostel Student Death

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Hostel Student Death | వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండల (Yellareddy Mandal) కేంద్రంలో చోటు చేసుకుంది.

Contents
  • Hostel Student Death | తెల్లవారుజామున వరండాలో..
    • Hostel Student Death | నస్రుల్లాబాద్​ మండలం హాజీపూర్​..

Hostel Student Death | తెల్లవారుజామున వరండాలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీసీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న శ్రావణి అనే విద్యార్థి బుధవారం తెల్లవారుజామున వసతి గృహం వరండాలో పడి మృతి చెందింది. శ్రావణి తెల్లవారుజామున వాష్ రూమ్ కోసం వెళ్లి వస్తుండగా పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. వరండాలో విద్యార్థిని పడిపోవడాన్ని గమనించిన వసతి గృహం సిబ్బంది… హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి (Yellareddy Government Hospital)కి తరలించారు. అక్కడ శ్రావణిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్డీవో ప్రభాకర్ తహశీల్దార్ ప్రేమ్, సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేష్ ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వసతిగృహానికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.

Hostel Student Death | నస్రుల్లాబాద్​ మండలం హాజీపూర్​..

నస్రుల్లాబాద్​ మండలం హాజీపూర్​నకు చెందిన శ్రావణి తండ్రి లేకపోవడంతో వసతి గృహంలో ఉండి నాలుగేళ్లుగా చదువుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. శ్రావణి తల్లి, అన్న, అక్క హైదరాబాద్ (Hyderabad)లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రావణి మృతి చెందడంతో హాస్టల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి పడి చనిపోయిందా.. గుండెపోటుతో చనిపోయిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై అధికారులు వైద్యులతో విద్యార్థులతో చర్చిస్తున్నారు. అయితే వసతిగృహంలో నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపిస్తూ హాజీపూర్​ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. వారంతా స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలివచ్చార. సమగ్ర విచారణ చేయాలని డిమాండ్​ చేశారు.

12 3

ఇది కూడా చదవండి..: Ambedkar jayanthi | సామాజిక న్యాయ కోసం అంబేడ్కర్​ విశేష కృషి.. బొబ్బిలి రామకృష్ణ

AI Technology in Education | కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థుల ఫేర్​వెల్​ పార్టీ
Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి
Khanapur Chairperson Election | ఖానాపూర్​ మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఎన్నిక మళ్లీ వాయిదా
Drunk Drive Fines Kamareddy | మందుబాబులకు షాక్​.. డ్రంకన్​ డ్రైవ్​లో ఒకేరోజు 525 మందికి జరిమానా
TAGGED:Hostel Student DeathHyderabadYellareddy Government HospitalYellareddy Mandal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article AP Inter Results AP Inter Results | ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
Next Article Pudi Srihari Arrest Pudi Srihari Arrest | చంద్ర‌బాబుపై సోష‌ల్ మీడియాలో పోస్ట్.. వైఎస్సార్‌సీపీ నేత పూడి శ్రీహరి అరెస్ట్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?