Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Thota Chandrasekhar | పవన్ కళ్యాణ్‌తో తోట చంద్రశేఖర్ ప్ర‌త్యేక‌ భేటీ.. మళ్లీ జనసేనలోకి వెళ్తారా!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Thota Chandrasekhar | పవన్ కళ్యాణ్‌తో తోట చంద్రశేఖర్ ప్ర‌త్యేక‌ భేటీ.. మళ్లీ జనసేనలోకి వెళ్తారా!

ఆంధ్రప్రదేశ్​

Thota Chandrasekhar | పవన్ కళ్యాణ్‌తో తోట చంద్రశేఖర్ ప్ర‌త్యేక‌ భేటీ.. మళ్లీ జనసేనలోకి వెళ్తారా!

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మళ్లీ జనసేనలోకి వెళ్తారా అనే చర్చ నడుస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 15, 2026 10:50 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Thota Chandrasekhar Pawan Kalyan Meet

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thota Chandrasekhar | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) అనూహ్యంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Contents
  • Thota Chandrasekhar | మెగా బ్ర‌దర్స్‌కి స‌న్నిహితుడిగా..
    • Thota Chandrasekhar | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం (Janasena Party Office)లో జరిగిన ఈ భేటీతో ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తోట చంద్రశేఖర్ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆయన మళ్లీ జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

Thota Chandrasekhar | మెగా బ్ర‌దర్స్‌కి స‌న్నిహితుడిగా..

తోట చంద్రశేఖర్ మహారాష్ట్ర (Maharastra) కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2008లో స్వచ్ఛంద విరమణ తీసుకున్న ఆయన, అనంతరం ఆదిత్య హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించి, మెగా బ్రదర్స్‌కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. తరువాత ఆయన రాజకీయ ప్రయాణం మారింది. వైఎస్సార్‌సీపీ తరఫున 2014లో ఏలూరు లోక్‌సభ (Eluru Lok Sabha) స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మళ్లీ జనసేనలో చేరి కీలక బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.

Thota Chandrasekhar | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు

మూడేళ్ల క్రితం ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నిర్ణయం ద్వారా కాపు వర్గాన్ని ఆకర్షించాలనే వ్యూహంతో కే చంద్రశేఖర్ రావు ముందుకు వచ్చినట్లు అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తోట చంద్రశేఖర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మళ్లీ పవన్ కళ్యాణ్‌ని కలవడం ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయా? లేక రాజకీయ పునరాగమనానికి సంకేతమా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఈ భేటీపై జనసేన వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల ముందు పార్టీని వీడకుండా ఉంటే తోట చంద్రశేఖర్ గుంటూరు జిల్లాలో కీలక నాయకుడిగా ఎదిగేవారని పార్టీ అనుచరులు భావిస్తున్నారు. ఆయన తిరిగి పార్టీలోకి వస్తే బలమైన నాయకత్వం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: TTD VIP Darshan Cancel | టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

 

Perni Nani Politics | పేర్ని నానికి రాజకీయాల్లో తిరుగులేదు.. జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
Income Tax Appointment | ఆదాయ పన్ను శాఖ ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని
Cheddi Gang in Tirupathi | తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. దొంగతనం విఫలం , సీసీటీవీ ఫుటేజ్‌తో ద‌ర్యాప్తు వేగ‌వంతం
Vizianagaram Bus Fire | విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్ర‌యాణికుల్లో ఎంఎల్ఏ కూడా ఉన్నారా..!
Macharla Rape Case | మాచర్లలో అమానుషం.. ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై ‘దిశ’ తరహాలో రేప్​!
TAGGED:Eluru Lok SabhaJanasena Party OfficeMaharastraPawan KalyanThota ChandrasekharThota Chandrasekhar Pawan Kalyan Meet
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Realme Narzo 100 Lite Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్
Next Article Telangana Heat Wave Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఈ నాలుగు రోజులు జాగ్రత్త
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?