అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD VIP Darshan Cancel | తిరుమల (Tirumala) శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. మరో 10 రోజుల్లో పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో రద్దీ పెరగనుంది. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు (TTD Officers) చర్యలు చేపడుతున్నారు.
వేసవి సెలవుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో మే 1 నుంచి వీఐపీ దర్శనాలతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేయాలిన టీటీడీ యోచిస్తోంది. వైకుంఠ ఏకదాశి (Vaikuntha Ekadashi) సమయంలో అనుసరించిన విధానాన్ని అమలు చేసి ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించాలని చూస్తున్నారు. ఈ మేరకు గత మూడేళ్లలో వేసవిలో భక్తుల రద్దీ వివరాలు విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం మే, జూన్, జులై నెలల్లో ప్రతినెలా సగటున 23-24 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు.
TTD VIP Darshan Cancel | 15 వేల మంది భక్తులకు..
ప్రస్తుతం వీఐపీ దర్శనాల (VIP Darshans) కోసం రోజుకు 2 నుంచి 3 గంటల సమయం కేటాయిస్తున్నారు. ఆ సమయంలో 3,800 మంది వీఐపీలు మాత్రమే స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. అదే సమయాన్ని సామాన్యులకు కేటాయిస్తే 15 వేల మంది స్వామి వారిని దర్శించుకునే వీలు అవుతుంది. దీంతో వేసవిలో రద్దీ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని టీటీడీ అధికారులు ఆలోచిస్తున్నారు.
TTD VIP Darshan Cancel | వేసవి నేపథ్యంలో చర్యలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. తిరుమలతో సైతం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో పాదరక్షలు వేసుకోవద్దనే నిబంధన ఉంది. దీంతో భక్తులు కాళ్లు కాలుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో రోడ్డుపై కూల్ పెయింట్ వేయిస్తున్నారు. అలాగే వాటర్ స్పింకర్ల ద్వారా రోడ్డుపై నీరు చల్లుతున్నారు. దీంతో భక్తులకు కాస్త ఉపశమనం లభిస్తోంది.
ఇది కూడా చదవండి..: AP Police Special Leaves | ఏపీ పోలీసులకు ప్రత్యేక సెలవులపై సర్కారు కీలక నిర్ణయం
