అక్షరటుడే, వెబ్డెస్క్: BJP Leader Suicide | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బడంగ్‌పేట్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుని తనువు చాలించాడు.
కుటుంబ కలహాలే మృతికి కారణమని మీర్పేట పోలీసులు తెలిపారు. కాగా బడంగ్‌పేట్ (Badangpet)లో జరిగిన అవినీతిపై రామకృష్ణారెడ్డి పోరాటం చేశారు. బుధవారం ఉదయం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్స్ వే విల్లాస్‌లో ఉన్న తన నివాసంలో రామకృష్ణ రెడ్డి ఉరివేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital)కి తరలించారు.
BJP Leader Suicide | ప్రజా సమస్యలపై పోరాటం
రామకృష్ణ రెడ్డి బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అవినీతి అనేక పోరాటాలు చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించేవారు. దీంతో ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉంది. ఇలాంటి నాయకుడు ఆత్మహత్య చేసుకోడంతో ఆయన కుటుంబంతో పాటు పార్టీలో విషాదం నెలకొంది. కాగా ఆయన ఆత్మహత్యపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Police Transfers | హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు
