Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Unauthorized Idol Installation | అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నిషేధం..: సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Unauthorized Idol Installation | అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నిషేధం..: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Unauthorized Idol Installation | అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నిషేధం..: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు చేయడం నిషేధమని, అలాగే పెద్ద శబ్ధంతో డీజేలు పెట్టడాన్ని అనుమతించేది లేదని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 4:04 సా.
Srinivas Kolluri
24 గంటలు ago
Share
Unauthorized Idol Installation

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Unauthorized Idol Installation | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు చేయడం నిషేధమని, అలాగే పెద్ద శబ్ధంతో డీజేలు పెట్టడాన్ని అనుమతించేది లేదని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

Contents
  • Unauthorized Idol Installation | పెద్ద శబ్దాలతో రోగులకు, చిన్నారులకు ఇబ్బందులు..
    • Unauthorized Idol Installation | ఊరేగింపులు, సభల నిర్వహణ..
      • Unauthorized Idol Installation | సార్వజనిక ప్రదేశాల్లో నియమాలు..
        • Unauthorized Idol Installation | నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుండి అప్రమత్తం..
        • Unauthorized Idol Installation | బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం..

Unauthorized Idol Installation | పెద్ద శబ్దాలతో రోగులకు, చిన్నారులకు ఇబ్బందులు..

ఎక్కువశబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని సీపీ అన్నారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేఈలను నిషేధించినట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ప్రతిష్టాపనకు తప్పనిసరిగా కలెక్టర్​తో కూడిన కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సీపీ తెలియజేశారు.

Unauthorized Idol Installation | ఊరేగింపులు, సభల నిర్వహణ..

ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్వీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమిషనర్ (Assistant Police Commissioner) అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమనికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలన్నారు.

Unauthorized Idol Installation | సార్వజనిక ప్రదేశాల్లో నియమాలు..

మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలని పోలీస్​ కమిషనర్​ సూచించారు. ప్రతిఒక్కరు క్యూ పద్దతిని తప్పనిసరి పాటించాలన్నారు. డ్రోన్ల వాడకం వలన ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరగుతుందని, ఈ డ్రోన్ల ఉపయోగం వలన జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకి విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎవరయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదల్చితే ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు, ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

Unauthorized Idol Installation | నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుండి అప్రమత్తం..

జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పలువురిని మోసం చేస్తున్నారన్నారు. పాస్​పోర్టు, వీసా, రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి చాలామంది గల్ఫ్ ఏజెంట్లు అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్నారు. వారిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని సీపీ సూచించారు. జిల్లాలో ‘ఎ’ సర్టిఫికేట్ ఉన్న సినిమాలకు చిన్నారులను అనుమతించవద్దని పేర్కొన్నారు.

Unauthorized Idol Installation | బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం..

బహిరంగ ప్రదేశాల్లో మద్య సేవించడాన్ని పూర్తిగా నిషేధించినట్లు సీపీ తెలిపారు. మహిళలు, పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి..: Turmeric price protest | వ్యవసాయ మార్కెట్​ను ముట్టడించిన రైతులు..

Kamareddy Municipal Meeting | గరంగరంగా కామారెడ్డి బల్దియాలో పరిచయ కార్యక్రమం.. అధికారులపై కౌన్సిలర్ల ఫైర్..
TGRJC Admissions 2026 | తెలంగాణ గురుకుల విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
Traffic Rules Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్
Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
Drunk Drive Fines Kamareddy | మందుబాబులకు షాక్​.. డ్రంకన్​ డ్రైవ్​లో ఒకేరోజు 525 మందికి జరిమానా
TAGGED:dj sound restrictionsdrone usage rules indiafake gulf agents warningloudspeaker regulationsnizamabad police rulespublic event permissionspublic safety guidelinesUnauthorized Idol Installation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Turmeric price protest | Turmeric price protest | వ్యవసాయ మార్కెట్​ను ముట్టడించిన రైతులు..
Next Article Stock Market Surge Stock Market Surge | బుల్ దూకుడు.. భారీగా పెరిగిన సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?