Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Drinking Water Supply | తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Drinking Water Supply | తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

నిజామాబాద్

Drinking Water Supply | తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

జిల్లాలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 4:52 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
Drinking Water Supply

అక్షరటుడే, భీమ్​గల్: Drinking Water Supply | జిల్లాలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. భీమ్​గల్​ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బాల్కొండ నియోజకవర్గ స్థాయి అధికారులతో ఆమె నీటిసరఫరాపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా నీటి లభ్యత, పైపులైన్ల మరమ్మతులు, ఇతర క్షేత్రస్థాయి సమస్యలపై ఆరా తీశారు.

Contents
  • Drinking Water Supply | యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
    • Drinking Water Supply | పాఠశాలలు, వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి
      • Drinking Water Supply | ఆధునిక వసతులతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’

Drinking Water Supply | యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

ఏ ఒక్క ఆవాస ప్రాంతంలోనూ నీటిఎద్దడి రాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. వేసవిలో నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని.. చేతిపంపులు, బోరుబావులకు అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేయించాలని.. పైపులైన్ల లీకేజీలను అరికట్టడంతో పాటు, ప్రతి ఇంటికీ నల్లా ద్వారా శుద్ధిచేసిన జలాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లోని వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు.

Drinking Water Supply | పాఠశాలలు, వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి

జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు (Anganwadi Centers) నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ముఖ్యంగా గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సమృద్ధిగా నీరుఅందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని కోరారు.

Drinking Water Supply | ఆధునిక వసతులతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (Telangana Public School) నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భీమ్​ గల్ మండలం గోన్‌గొప్పుల ప్రభుత్వ పాఠశాల ఆవరణను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ గదులు, ఆర్​వో ప్లాంట్ వంటి అన్ని ఆధునిక వసతులతో కూడిన ప్రణాళికలను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, (Armoor Sub-Collector Abhigyan Malviya) ఆర్​డబ్ల్యూఎస్​ ఎస్ఈ రాజేందర్, డీపీవో శ్రీనివాస్ రావు, డీఈవో అశోక్, ఇతర నియోజకవర్గ అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Farmers MSP Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: మార్కెట్‌ కమిటీ వైస్ ఛైర్మన్‌ గడ్డం నర్సారెడ్డి

BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
Teachers Protest | పెండింగ్ సమస్యలపై పోరాటం.. నిరసన తెలిపిన ఉపాధ్యాయులు..
Society Name Forgery | ఫోర్జరీ చేసి సొసైటీ పేరును మార్చారు.. సీపీకి మాణిక్ భవన్ కమిటీ ఫిర్యాదు
RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం
Road Safety Campaign | ‘నాన్న, దయచేసి నా కోసం.. అమ్మ కోసం హెల్మెట్ వాడండి’.. విద్యార్థుల వినూత్న పోస్టుకార్డు ఉద్యమం..
TAGGED:Anganwadi CentersArmoor Sub-Collector Abhigyan MalviyaCollector Ila Tripathidistrict collector ordersDrinking Water Supplyrural water managementsummer water crisisTelangana Public School
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Illegal Sand Transport Illegal Sand Transport | అక్రమ ఇసుక రవాణాపై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టివేత
Next Article Kamareddy Congress Kamareddy Congress | కాంగ్రెస్​లో పలువురి చేరిక
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?