Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: LIC New Apps | ఎల్ఐసీ మరో ముందడుగు.. రెండు కొత్త యాప్‌ల ఆవిష్కరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - LIC New Apps | ఎల్ఐసీ మరో ముందడుగు.. రెండు కొత్త యాప్‌ల ఆవిష్కరణ

బిజినెస్​

LIC New Apps | ఎల్ఐసీ మరో ముందడుగు.. రెండు కొత్త యాప్‌ల ఆవిష్కరణ

ఎల్ఐసీ తన డిజిటల్ ప్రయాణంలో మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా పాలసీదారులతోపాటు ఏజెంట్ల కోసం రెండు యాప్‌లను ఆవిష్కరించింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 11:37 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
LIC New Apps

అక్షరటుడే, వెబ్​డెస్క్: LIC New Apps | ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) రెండు యాప్‌లను తీసుకువచ్చింది. వినియోగదారుల కోసం ‘మైఎల్ఐసీ’; మార్కెటింగ్ సిబ్బంది కోసం ‘సూపర్ సేల్స్ సాథీ’ (‘Super Sales Saathi’)యాప్ లను ఆవిష్కరించింది. ఇవి పాలసీ నిర్వహణ, ప్రీమియం చెల్లింపు, కొత్త పాలసీల కొనుగోలు సహా పలు అంశాల్లో ఏజెంట్లు, పాలసీదారులకు ఏఐ ఆధారిత సేవలను అందించనున్నాయి.

Contents
  • LIC New Apps | మైఎల్ఐసీ యాప్ ..
    • LIC New Apps | సూపర్ సేల్స్ సాథీ యాప్..

కార్యాలయాలపై ఆధారపడడాన్ని తగ్గించి, దేశవ్యాప్తంగా ఆపరేషనల్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఎల్​ఐసీ చేపట్టిన ‘ డ్రైవ్’ ప్రాజెక్టులో ఇది ప్రధాన వ్యూహాత్మక మార్పుగా భావిస్తున్నారు. అంటే ఇకపై ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేకుండానే, ఫోన్ ద్వారానే పలు రకాల సేవలను పొందడానికి వీలుంటుంది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని కల్పించడంతోపాటు ఏజెంట్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ యాప్స్ దోహదపడనున్నాయి.

LIC New Apps | మైఎల్ఐసీ యాప్ ..

పాలసీదారులు సులభంగా తమ బీమా పాలసీలను నిర్వహించుకోవడానికి మైఎల్ఐసీ యాప్ (MyLIC App) ఉపయోగపడుతుంది. ఇంతకుముందుకంటే వేగంగా ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించడానికి అవకాశం ఉంటుంది. యాప్ ద్వారానే పాలసీపై లోన్ తీసుకోవడానికి వీలుంటుంది. పెండింగ్‌లో ఉన్న లేదా ల్యాప్స్ అయిన పాలసీలను సైతం దీని ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. ఇ- కేవైసీ చేసుకోవచ్చు. కొత్త పాలసీల గురించి కూడా తెలుసుకోవడానికి ఈ యాప్ వీలు కల్పిస్తుంది.

LIC New Apps | సూపర్ సేల్స్ సాథీ యాప్..

ఏజెంట్ల సౌకర్యార్థం ఎల్ఐసీ తెచ్చిన యాప్ ఈ సూపర్ సేల్స్ సాథీ. ఇక్కడ అత్యాధునిక డిజిటల్ సేల్స్ టూల్స్ అందుబాటులో ఉంటాయి. దీనిద్వారా పాలసీల స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. పాలసీదారులకు సంబంధించిన ప్రీమియం చెల్లింపు వివరాలును తెలుసుకోవచ్చు. ఏఐ ఆధారిత సూచనల ద్వారా పాలసీదారులకు మెరుగైన సేవలు, సూచనలు అందించడానికి అవకాశం ఉంటుంది. లక్ష్యాలు, సాధించిన విజయాలు చూసుకునేందుకు డాష్‌బోర్డు అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి..: Gold Silver Prices | పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గే సూచనలు.. దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుదల

 

Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!
Lava Bold 2 5G | పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో ఫోన్
Mahindra BE6 Batman Edition | ధర పెరిగినా ‘బ్యాట్‌మాన్’కు తగ్గని డిమాండ్.. ఏడు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!
VinFast VF MPV 7 | ‘విన్‌ఫాస్ట్’ నుంచి మరో ఈవీ కారు..
March 25 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
TAGGED:‘Super Sales Saathi’AI insurancedigital LICIndia insuranceinsurance appsLICLIC New AppsLife Insurance Corporation of Indiapolicy managementpremium payment
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Running Car Fire Running Car Fire | రన్నింగ్​ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
Next Article Women Bill Delimitation Women Bill Delimitation | మహిళా రిజర్వేషన్​కు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం కుట్రలో భాగమే : కల్వకుంట్ల కవిత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?