Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Medipally Police | జ్యూస్ అని చెప్పి.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Medipally Police | జ్యూస్ అని చెప్పి.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని

హైదరాబాద్క్రైంతెలంగాణ

Medipally Police | జ్యూస్ అని చెప్పి.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల బోడుప్పల్​లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. జ్యూస్​ అని చెప్పి బాలుడికి పిన్ని యాసిడ్​ తాగించింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 12:50 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Medipally Police

అక్షరటుడే, వెబ్​డెస్క్: Medipally Police | సమాజంలో రోజు రోజుకు నేర ప్రవృత్తి పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలతో పలువురు హత్యలు చేయడానికి వెనుకాడటం లేదు. తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ మహిళ తోటి కోడలి కుమారిడికి జ్యూస్​ అని చెప్పి యాసిడ్​ తాగించింది.

Contents
  • Medipally Police | బోడుప్పల్​లో అమానవీయ ఘటన
    • Medipally Police | గతంలోనూ..

Medipally Police | బోడుప్పల్​లో అమానవీయ ఘటన

హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల బోడుప్పల్​ (Boduppal)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తోటికోడలి కుమారుడిపైనే మామకు ఎక్కువ ప్రేమ ఉందనే అసూయతోనే ఓ మహిళ ఆ బాలుడిని చంపాలని నిర్ణయించుకుంది. నాగరాజు, సంధ్య అనే దంపతులకు కార్తీక్(4) అనే కుమారుడు ఉన్నాడు. కార్తీక్​పై మామ ఎక్కువ ప్రేమ చూపించడాన్ని తట్టుకోలేక.. అతడ్ని చంపాలని నాగరాజు సోదరుడి భార్య మంజుల ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే.. జ్యూస్ అని చెప్పి కార్తీక్​కు యాసిడ్ తాగించింది. విషయం తెలిసి మంజులపై కార్తీక్ తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Medipally Police | గతంలోనూ..

తన కొడుకును చిన్న చూపు చూస్తున్నారని మంజుల అసూయ పెంచుకుంది. కార్తీక్​పై ఇంట్లో వారు ఎక్కువ ప్రేమ కనబరచడాన్ని తట్టుకోలేకపోయింది. ఇటీవల కార్తీక్​ పేరును తన మామ చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దీంతో ఆమె మరింత కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో ఆ బాలుడిని అంతం చేయాలని ప్లాన్​ వేసింది. ఇటీవల బాలుడి ముక్కు, గొంతు మూసి హత్యాయత్నం చేసింది. కార్తీక్​ తల్లి సంధ్య గమనించి ప్రశ్నించడంతో ఆడుకుంటున్నామని చెప్పింది.

అనంతరం మరో రోజు బాలుడిని ఇంటిపై అంతస్తుకు తీసుకెళ్లి రెయిలింగ్‌పై కూర్చోబెట్టింది. గమనించిన తాత మందలించాడు. ఈ నెల 9న మంజుల కార్తీక్​ను కిచెన్‌లోకి తీసుకెళ్లి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పింది. అనంతరం యాసిడ్ (Acid) తాగించింది. ఈ ఘటనపై బుధవారం బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి..: Running Car Fire | రన్నింగ్​ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి
Telangana Weather Alert | రైతులకు అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో అకాల వర్షాలు!
Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు
Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!
Running Car Fire | రన్నింగ్​ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
TAGGED:acid attackattempted murderBoduppalchild abusecrime news indiafamily disputeHyderabadHyderabad crimeMedipalli Policemedipally police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article India Solar Power Growth India Solar Power Growth | సౌర‘శక్తి’ సామ్రాజ్యంలో నంబర్ 2గా భారత్
Next Article Lok Sabha Lok Sabha  | మూడు కీలక బిల్లులపై రేపు లోక్​సభలో ఓటింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?