Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Turmeric Board Nizamabad | అర్వింద్​ తెచ్చిన పసుపు బోర్డుతో ఏం లాభం..?: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Turmeric Board Nizamabad | అర్వింద్​ తెచ్చిన పసుపు బోర్డుతో ఏం లాభం..?: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

నిజామాబాద్

Turmeric Board Nizamabad | అర్వింద్​ తెచ్చిన పసుపు బోర్డుతో ఏం లాభం..?: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

ఎంపీ అర్వింద్​ నిజామాబాద్​ పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారని.. దీని ద్వారా లాభం ఉంటే రైతులు మద్దతు ధర కోసం రోడ్డుపై ధర్నాలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి ప్రశ్​నించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 3:58 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
Turmeric Board Nizamabad

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Turmeric Board Nizamabad | ఎంపీ అర్వింద్​ (MP Arvind) నిజామాబాద్​కు పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారని.. మరి పసుపు రైతులు మద్దతు ధర కోసం రోడ్డుపై ధర్నాలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి డిమాండ్​ చేశారు. ఈ మేరకు నగరంలోని కాంగ్రెస్​ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Contents
  • Turmeric Board Nizamabad | ఆన్​లైన్​ కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు
    • Turmeric Board Nizamabad | దేశంలోనే పెద్ద మార్కెట్​ నిజామాబాద్​..
      • Turmeric Board Nizamabad | 2009లో తులం బంగారం రూ.18వేలు ఉంటే..
      • Turmeric Board Nizamabad | వెంటనే సాఫ్ట్​వేర్​ను నిజామాబాద్​ మార్కెట్​కు కలపాలి..
      • Turmeric Board Nizamabad | పసుపు బోర్డుతో ఏలాభం..

Turmeric Board Nizamabad | ఆన్​లైన్​ కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు

ఈ సందర్భంగా నగేష్​ రెడ్డి మాట్లాడుతూ.. 2004 నుంచి 2014 వరకు తాను మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా కొనసాగిన సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమయస్ఫూర్తితో పరిష్కరించడం జరిగిందన్నారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఆన్​లైన్​ విధానాన్ని తీసుకువచ్చి దేశంలో ఎక్కడైనా కొనుక్కునే అవకాశం కల్పించామన్నారు. ఆన్​లైన్​ వస్తే రైతులకు మద్దతు ధర వస్తుందా లేదంటే నష్టపోతారా అనే భయం ఉన్నప్పటికీ మొదటగా నిజామాబాద్​లో ఆన్​లైన్​ పద్ధతి తీసుకువచ్చామన్నారు. 2014 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత 2016లో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆన్​లైన్​లో పాయింట్ జీరో పద్ధతి ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

Turmeric Board Nizamabad | దేశంలోనే పెద్ద మార్కెట్​ నిజామాబాద్​..

దేశంలో 10 లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చే పెద్ద మార్కెట్ నిజామాబాద్ (Nizamabad Market) అని తెలిపారు. సాంగ్లీ, ఈరోడ్ మార్కెట్లతో పోటీ ఉంటుందని నగేష్​ రెడ్డి చెప్పారు. ఆ మార్కెట్లలో ఉన్న ధరల కంటే ఎక్కువ ధర ఇక్కడ వచ్చే విధంగా పోటీ పడాల్సి ఉంటుందన్నారు. అయితే సాంగ్లీలో 3000 క్వింటాళ్ల కంటే ఎక్కువ పసుపు రాదని అదే నిజామాబాద్ (Nizamabad)​కు సీజన్ బట్టి రోజుకు 50 వేల నుంచి 60 వేల క్వింటాళ్ల పసుపు వస్తుందన్నారు. ధర కోసం అప్పట్లోనే తాము మార్కెట్​లో మూడు వేర్వేరు స్థానాలలో రైతుల ద్వారా పసుపును కుప్పలు పోయించడం జరిగిందని, దీని ద్వారా సాంగ్లీ కంటే ఎక్కువగా రూ.17వేల క్వింటాల్​కు ధర కల్పించడం జరిగిందని గుర్తు చేశారు.

Turmeric Board Nizamabad | 2009లో తులం బంగారం రూ.18వేలు ఉంటే..

2009లో తులం బంగారం రూ.18 వేలు ఉంటే క్వింటాలు పసుపు ధర రూ.17వేల రూపాయలు వచ్చిందని ఆ విధంగా మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయడం జరిగిందని నగేశ్​ రెడ్డి తెలిపారు. 2016లో పాయింట్ జీరోతో ఆన్​లైన్​ సాఫ్ట్​వేర్​ పద్ధతిని ప్రారంభించడం జరిగిందన్నారు. రెండు నెలల క్రితం వరకు అదే సాఫ్ట్​వేర్​ కొనసాగిందని వివరించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 0.2 తీసుకురావడం జరిగిందని.. గతంలో ఉన్న కాంట్రాక్టర్​తో ఒప్పందం అయిపోవడంతో వేరే వారికి అప్పగించడం ద్వారా సాఫ్ట్​వేర్​ను నిజామాబాద్ మార్కెట్​కు అనుసంధానం చేయకుండా బీజేపీ కుట్ర చేసిందన్నారు. పసుపు బోర్డు నిజామాబాద్​లో ఉన్నప్పటికీ ఎందుకు నిజామాబాద్ మార్కెట్​కు సాఫ్ట్​వేర్​ అనుసంధానం చేయలేదని ప్రశ్నించారు.

Turmeric Board Nizamabad | వెంటనే సాఫ్ట్​వేర్​ను నిజామాబాద్​ మార్కెట్​కు కలపాలి..

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం (BJP Government) సాఫ్ట్​వేర్​ 0.2లో నిజామాబాద్ మార్కెట్​ను కలపాలని డిమాండ్ చేశారు. కానీ అలా చేయకుండా రైతులను రోడ్ల మీదికి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరైంది కాదన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకువచ్చిందన్నారు. పంజాబ్ రైతులు నిరంతరం పోరాటం చేయడం ద్వారా వాటిని వెనక్కి తీసుకోవడం, అదేవిధంగా ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెట్టుకోవడం ద్వారా దేశ రైతులు నష్టపోతారన్నారు.

అమెరికాలో వేల ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తారని ఒక ఎకరాకు 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, అటువంటి దానిని జీరో టాక్స్ ద్వారా మన దేశానికి దిగుమతి చేస్తున్నారని.. ఇక్కడున్న మొక్కజొన్న ఎటు పోవాలని డీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు. దీని ద్వారా రైతులు నష్టపోతారని.. కావున వెంటనే వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే జైల్లో పెట్టారన్నారు.

Turmeric Board Nizamabad | పసుపు బోర్డుతో ఏలాభం..

ఎంపీ అర్వింద్​ నిజామాబాద్​కు పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నాడని.. పసుపు బోర్డు ద్వారా రైతులకు నిజంగా లాభముంటే ఎందుకు పసుపు రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారో  చెప్పాలని నగేష్​రెడ్డి ప్రశ్నించారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు వచ్చే లాభాలు ఏమీ లేవని పసుపునకు మద్దతు ధర కల్పిస్తే రైతుకు లాభాలు ఉంటాయన్నారు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పసుపునకు మద్దతు ధర ప్రకటించేలా అర్వింద్​ కేంద్రంతో కొట్లాడాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, కార్పొరేటర్లు ప్రవీణ్ గౌడ్, పంచారెడ్డి చరణ్, ఎర్రం గంగాధర్, అమర్ సింగ్, నరేందర్, హరిచంద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవి, జిల్లా ఫిషరీస్ ఛైర్మన్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శివ, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినయ్, టౌన్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుభాష్ జాదవ్, సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Women reservation | మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఒక చరిత్రాత్మక ఘట్టం : ఎమ్మెల్యే ధన్​పాల్​

Urea Shortage | యూరియా కోసం అన్నదాతల కష్టాలు.. చెప్పులతో క్యూలైన్​..
Mobile Phone Recovery | స్పెషల్ డ్రైవ్​లో 123 ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్ చంద్ర
Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Nizamabad Municipal Budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​ సమావేశం ప్రారంభం
Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు
TAGGED:agriculture news telanganaBJP GovernmentCentral Governmentcongress bjp rowFarmer issues IndiaMP Arvindnizamabad marketnizamabad market newssupport price turmericTurmeric Board Nizamabadturmeric farmers protestturmeric price
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article TCS Nashik Case TCS Nashik Case | టీసీఎస్​ నాసిక్​ బీపీవో సంస్థ మూసివేత.. కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Next Article Narender Reddy  Narender Reddy | వేం నరేందర్ రెడ్డిని కలిసిన జిల్లా నాయకులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?