Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women reservation | మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఒక చరిత్రాత్మక ఘట్టం : ఎమ్మెల్యే ధన్​పాల్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Women reservation | మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఒక చరిత్రాత్మక ఘట్టం : ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్

Women reservation | మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఒక చరిత్రాత్మక ఘట్టం : ఎమ్మెల్యే ధన్​పాల్​

నారీ శక్తి.. దేశానికే శక్తి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో నారీ శక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 15, 2026 7:59 సా.
Shashi kiran Mottala
14 గంటలు ago
Share
Women reservation |
Women reservation | మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఒక చరిత్రాత్మక ఘట్టం..: ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: Women reservation | నారీ శక్తి…దేశానికే శక్తి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal) అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని నాందేవ్​వాడ శివాజీ చౌక్ నుంచి ఉమా మహేశ్వరాలయం వరకు నారీ శక్తి వందన్ ర్యాలీ(Nari Shakti Vandan Rally) నిర్వహించారు. అనంతరం సభ ఏర్పాటు చేశారు.

Contents
  • Women reservation | మహిళల హక్కులు రక్షించడానికి..
    • Women reservation | 60 ఏళ్లుగా కాంగ్రెస్​ అమలు చేయలేదు

Women reservation | మహిళల హక్కులు రక్షించడానికి..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా స్వతంత్రం చేయడం, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు పెంచడం, మహిళల హక్కులు రక్షించడం.. నారీ శక్తి అభియాన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. మహిళల పాత్ర కుటుంబం నుంచి దేశాభివృద్ధి వరకు కీలకం కానుందన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇది కేవలం ఒక పథకం కాదని, మహిళలను సమాన హక్కులతో సమాజంలో ముందుకు తీసుకెళ్లే మహత్తర ఉద్యమం అన్నారు.

Women reservation | 60 ఏళ్లుగా కాంగ్రెస్​ అమలు చేయలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం 60ఏళ్లుగా అమలు చేయని మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోదీ(PM Modi) చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని చెప్పారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకురాలు, ఆదిలాబాద్ మాజీ జెడ్పీ ఛైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమంలో మహిళలు రాణిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని సూచించారు.

మొదటిసారి 1996లోనే మహిళా బిల్లు ప్రవేశపెట్టారని కానీ మోక్షం కలగలేదన్నారు. ప్రధాని మోదీ వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ గొప్ప నిర్ణయం అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు(National Turmeric Board) ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి, విప్ న్యాలం సునీత, కార్పొరేటర్లు కల్పె అర్చన, వైష్ణవి, ఇప్పకాయల సుమిత్ర, కాంపల్లి మమత, ప్రసూన తదితరులు పాల్గొన్నారు.

 

Extramarital Affair Murder | ఇద్దరితో అక్రమ బంధం.. ఒకడి సహకారంతో మరొకడిని కడతేర్చిన మహిళ!
Heatwave Awareness Nizamabad | వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Armoor Cordon Search | ఆర్మూర్​లో పోలీసుల కార్డన్​సెర్చ్​
Womens Health Awareness | మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : మేయర్ ఉమారాణి
Ambali Distribution Center | కలెక్టరేట్​లో అంబలి కేంద్రం ఏర్పాటు అభినందనీయం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
TAGGED:bjp rallygender equalityMLA Dhanpalnari shaktiNari Shakti Vandan RallyNational Turmeric BoardPalle GangareddyPM Modipolitical empowermentreservation billwomen reservationwomen rights
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Dalit Christian verdict | Dalit Christian verdict | సుప్రీంకోర్టు తీర్పుతో దళిత క్రైస్తవులకు అన్యాయం
Next Article Women Reservation Bill Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నాం : రాహుల్ గాంధీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?