Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Government Schemes | అర్హులకు పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Government Schemes | అర్హులకు పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

నిజామాబాద్

Government Schemes | అర్హులకు పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

అర్హులకు పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 4:07 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Government Schemes

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Government Schemes | అర్హులకు పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సదాశివనగర్ మండలంలో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్​ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Contents
  • Government Schemes | గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారం..
    • Government Schemes | అధికారులు సమన్వయంతో..
      • Government Schemes | సర్పంచ్​లకు ప్రత్యేక సూచనలు..

Government Schemes | గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారం..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్​ తెలిపారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను సభల్లో నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Government Schemes | అధికారులు సమన్వయంతో..

మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Government Schemes | సర్పంచ్​లకు ప్రత్యేక సూచనలు..

అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ (Oil Palm) సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని.. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. కలెక్టర్ చొరవతో త్వరలో మండలానికి ఆర్టీసీ బస్సు రానుందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో గిరి, డీఆర్​డీవో సురేందర్​, ప్రత్యేక అధికారి సతీష్, డీఎంహెచ్​వో రవీందర్, తహశీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Degree College Admissions | భీమ్​గల్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సందడి

Hey Bhuthanathaya Teaser | లింగంపేటలో హే భూతనాథాయ టీజర్ ఆవిష్కరణ
TNGOs employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ కృషి
Nizamabad Premier League | క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్ నిర్వహణ : సీపీ సాయిచైతన్య
Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
TAGGED:Ashish Sangwan collectorbeneficiary schemes telanganaCollector Ashish Sangwangovernment schemes telanganaOil Palmoil palm farmingPraja Palana Programrural development indiaTelangana welfare schemes
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Degree College Admissions Degree College Admissions | భీమ్​గల్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సందడి
Next Article Women Reservation Bill Women Reservation Bill | దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం : ప్రధాని మోదీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?