Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tejasvi Surya | పార్లమెంట్​లో తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాష్ట్ర నేతల ఫైర్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Tejasvi Surya | పార్లమెంట్​లో తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాష్ట్ర నేతల ఫైర్​..

తెలంగాణజాతీయంతాజా వార్తలు

Tejasvi Surya | పార్లమెంట్​లో తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాష్ట్ర నేతల ఫైర్​..

తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఫైర్​ అవుతున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 6:00 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 గంటలు ago
Share
Tejasvi Surya speaking in legislative assembly

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tejasvi Surya | తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఫైర్​ అవుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్​, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​, మాజీ మంత్రి హరీశ్​రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు మండిపడ్డారు.

Contents
  • Tejasvi Surya | పొన్నం ఘాటు వ్యాఖ్యలు
    • Tejasvi Surya | తెలంగాణపై నరనరాన వ్యతిరేకత: కేటీఆర్
      • Tejasvi Surya | పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పాలి: హరీశ్​రావు

Tejasvi Surya | పొన్నం ఘాటు వ్యాఖ్యలు

లోక్ సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ సూర్య తెలివిలేని వెదవ అని ఘాటు వ్యాఖ్యలతో మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటుపై అజ్ఞానంగా మాట్లాడారని అతడి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన పొన్నం.. తేజస్వీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. తేజస్వీ సూర్యపై చర్య తీసుకోవాలని లోక్‍సభ స్పీకర్​కు లేఖ రాయనున్నట్లు చెప్పారు.

Tejasvi Surya | తెలంగాణపై నరనరాన వ్యతిరేకత: కేటీఆర్

తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం మూర్ఖత్వమన్నారు. తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

Tejasvi Surya | పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పాలి: హరీశ్​రావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను హరీశ్​ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఆవిర్భావంతో పోల్చడం ఏమిటని మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పార్లమెంట్ వేదికగా ఒక ఎంపీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. భారత సమాఖ్య స్ఫూర్తిపై బీజేపీకి ఉన్న అజ్ఞానాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Lok Sabha  | మూడు కీలక బిల్లులపై రేపు లోక్​సభలో ఓటింగ్​

Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్
April 11 Horoscope | అమ్మ వైపు బంధువుల ద్వారా కనక వర్షం.. తలుపు తట్టనున్న లక్ష్మీదేవి!
Fee Regulation | ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలి..: కవిత
Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..
Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
TAGGED:BJP controversyHarish Raoindia politicsKTR reactionparliament newsPonnam PrabhakarTejasvi SuryaTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Employees Protest | Telangana Employees Protest | రేపు జిల్లావ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
Next Article Telangana Investments Telangana Investments | తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్​ బాబు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?