Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Investments | తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్​ బాబు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Investments | తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్​ బాబు

తెలంగాణ

Telangana Investments | తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్​ బాబు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. అమెరికన్ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 6:21 సా.
Srinivas Kolluri
3 గంటలు ago
Share
Telangana Investments

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Investments | ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలలో జాతీయ అగ్రగామిగా ఎదుగుతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) కోరారు. అమెరికన్ పారిశ్రామికవేత్తలతో గురువారం ఆయన సమావేశం అయ్యారు.

Contents
  • Telangana Investments | దిగ్గజ సంస్థలు
    • Telangana Investments | సాంకేతిక రంగంలో..

డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు, ఏరోస్పేస్ విడిభాగాలు, రక్షణ ఎలక్ట్రానిక్స్, సైబర్ భద్రత (Cyber ​​Security), అంతరిక్ష సాంకేతికత, రక్షణ రంగంలో ఏఐ, ఉపగ్రహ వ్యవస్థలు, అధునాతన కమ్యూనికేషన్ల వంటి రంగాలలో తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి చెప్పారు. రాకెట్ల తయారీ నుంచి అధునాతన డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడిభాగాల నుంచి ఉపగ్రహాల వరకు “మేడ్ ఇన్ తెలంగాణ” ముద్ర ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలలో 30 శాతానికిపైగా వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోందని వెల్లడించారు.

Telangana Investments | దిగ్గజ సంస్థలు

డీఆర్​డీవో (DRDO), బీహెచ్​ఈఎల్, మిథాని, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఆర్‌సీఐ, హెచ్‌ఏఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, ఎయిర్‌బస్, డాసాల్ట్ ఏవియేషన్ వంటి ప్రపంచ ఏరోస్పేస్ దిగ్గజాలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ఏరోస్పేస్ నగరంగా నిలిచిందని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం ఒక పటిష్టమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని మంత్రి నొక్కి చెప్పారు. టీఎస్-ఐపాస్ ద్వారా 15 నుంచి 30 రోజులలోపు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు.

Telangana Investments | సాంకేతిక రంగంలో..

సాంకేతికత, పరిశోధన, తయారీ, నైపుణ్యాభివృద్ధి రంగాలలో కూడా అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా మారడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని శ్రీధర్​బాబు పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో కలిసి పని చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కౌన్సిలర్ పాల్ నారాయణ్ అన్నారు.

 ఇది కూడా చదవండి : MeeSeva ACB raids | మీసేవా కేంద్రాలపై ఏసీబీ దాడులు.. పలు కీలకపత్రాలు స్వాధీనం..

Police Inspector Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ
She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు
Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఈ నాలుగు రోజులు జాగ్రత్త
HYDRAA Land Protection | 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
IAS posting | ఐఏఎస్​ అధికారి వాణిప్రసాద్​కు పోస్టింగ్​
TAGGED:aerospace industry Indiadefense sector Telanganadrone industry IndiaHyderabad tech hubspace technology IndiaTelangana investments
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Tejasvi Surya speaking in legislative assembly Tejasvi Surya | పార్లమెంట్​లో తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాష్ట్ర నేతల ఫైర్​..
Next Article Delimitation Seats Increase Delimitation Seats Increase | తెలంగాణలో 26, ఏపీలో 38 ఎంపీ స్థానాలు : అమిత్‌ షా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?