అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maruti Ignis Discontinued | దేశీయ ఆటోమొబైల్ (Domestic Automobile) రంగ దిగ్గజం మారుతి సుజుకీ తన పాపులర్ టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ అయిన ‘ఇగ్నిస్’ కార్ల ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.
దాదాపు నెల రోజుల క్రితమే దీని ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం డీలర్లు ఈ కారు కొత్త బుకింగ్‌లను తీసుకోవడం నిలిపివేసినప్పటికీ.. నెక్సా వెబ్‌సైట్‌లో మాత్రం ఇంకా లిస్టింగ్‌లో కనిపిస్తుండడం గమనార్హం.
Maruti Ignis Discontinued | 2017లో విడుదలై..
మారుతి సుజుకీ (Maruti Suzuki) ఇగ్నిస్ మోడల్‌ను 2017లో భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. మారుతి సుజుకీ తన ప్రీమియం నెట్‌వర్క్ నెక్సా ద్వారా విక్రయించిన అత్యంత సరసమైన కారిది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 83 బీహెచ్‌పీ శక్తిని, 113 ఎనఎం టార్క్‌ను అందిస్తుంది. ఏబీఎస్, ఈబీడీ, ఐసోఫిక్స్ మౌంట్‌ల వంటి ప్రామాణిక భద్రత ఫీచర్లున్నాయి. 7 అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, క్లైమేట్ కంట్రోల్, ఎయిర్‌క్రాఫ్ట్ స్టైల్ స్విచ్‌లతో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విభిన్నమైన డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్‌తో యువతను ఆకర్షించింది. ముఖ్యంగా బ్యాచిలర్స్, చిన్న కుటుంబాలకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా నిలిచింది. 2020లో ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను తీసుకువచ్చారు.
Maruti Ignis Discontinued | ఎందుకీ నిలిపేశారంటే..
ప్రస్తుతం భారత మార్కెట్ (Indian market)లో హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే మైక్రో ఎస్‌యూవీలకే క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ విభాగంలో టాటా పంచ్ దూసుకుపోతోంది. ఇగ్నిస్ స్టైలిష్‌గా ఉన్నా టాటా పంచ్ ఇచ్చే ఎస్‌యూవీ ఫీలింగ్‌ను ఇవ్వలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇగ్నిస్‌ను నిలిపివేసి, పవర్‌ఫుల్ మైక్రో ఎస్‌యూవీని తీసుకురావాలని మారుతి నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ‘వై43’ అనే కోడ్‌నేమ్‌తో కొత్త ఎస్ యూవీని అభివృద్ధి చేస్తున్నారు. ఇది 1.2 లీటర్ ‘డ్యుయల్ జెట’ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త కారు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని, ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ లకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర కూడా రూ. 6 లక్షలలోపే ఉండే అవకాశాలున్నాయి. నెక్సా ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తారని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు
