అక్షరటుడే, ఆర్మూర్: Armoor Protest | పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ (Bajrang Dal) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో పెరుగుతున్న ‘వికృత జిహాదీ మనస్తత్వం’ అసాంఘిక సంఘటనలను వ్యతిరేకంగా అంబేడ్కర్ చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించారు.
Armoor Protest | నాసిక్‌లో జరిగిన ఉదంతంపై..
నాసిక్ టీసీఎస్(TCS)లో లవ్ జిహాద్ వెలుగు చూసిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నట్లు భావిస్తున్న లవ్ జిహాద్ (Love Jihad) కుట్రలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యకర్తలు పేర్కొన్నారు. ప్రభుత్వ, అటవీ భూముల ఆక్రమణలు, సైనిక రైల్వే భూములను ఆక్రమించడం, ఆహార పదార్థాలను ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేయడం, హిందూ కుటుంబాలను వేధించడంలాంటి ఘటనలను వారు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేషా సంపర్క్ ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, జిల్లా ప్రచార ప్రముఖ్ నిఖిల్, నగర ఉపాధ్యక్షుడు గంజాల ప్రేమ్, సహా కార్యదర్శి బోబిడే కరణ్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్, సహా సంయోజక్ అభిలాష్, సేవా ప్రముఖ్ శ్రీకాంత్, సప్తహిక్ మిలన్ అరవింద్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, బలోపాసన ప్రముఖ్ సాయి, సంస్కృత ప్రముఖ్ యోగేష్, రిషి, లింబాద్రి, రఘు, బిట్టు, అభినయ్, విజయ్, ధనుంజయ, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Beach Volleyball Nationals | జాతీయస్థాయి ఎస్జీఎఫ్ బీచ్ వాలీబాల్ పోటీలకు మగ్గిడి విద్యార్థులు
