Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gautam Adani | అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే రిచ్చెస్ట్ పర్సన్‌గా రికార్డు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Gautam Adani | అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే రిచ్చెస్ట్ పర్సన్‌గా రికార్డు

అంతర్జాతీయం

Gautam Adani | అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే రిచ్చెస్ట్ పర్సన్‌గా రికార్డు

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఈ క్రమంలో ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని దాటేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 4:25 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Gautam Adani

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Adani | అంతర్జాతీయంగా కొంతకాలంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ (Stock Market) తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. దీంతో కుబేరుల సంపదా తగ్గిపోయింది. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లోనూ కొన్ని కంపెనీలు రాణిస్తున్నాయి. ప్రధానంగా అదానీ గ్రూప్ స్టాక్స్ రాణించాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద గణనీయంగా పెరిగింది.

Contents
  • Gautam Adani | ఎవరి సంపద ఎంతంటే..
    • Gautam Adani | ప్రపంచ నంబర్ వన్ మస్కే..
      • Gautam Adani | భారత్‌లో టాప్ టెన్ సంపన్నులు..

ప్రస్తుతం భారత్‌తో పాటుగా ఆసియాలో కూడా అత్యంత ధనవంతుడిగా ఆయన నిలిచారు. మరోవైపు ఇదే సమయంలో రిలయన్స్ గ్రూప్ స్టాక్స్ పనితీరు నిరాశ పరిచింది. దీంతో ఆ కంపెనీల మార్కెట్ విలువ పడిపోయి ముఖేశ్ అంబానీ సంపద కూడా తగ్గింది. దీంతో చాలాకాలంగా దేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) రెండో స్థానానికి పడిపోయారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది.

Gautam Adani | ఎవరి సంపద ఎంతంటే..

ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ రిచ్ లిస్ట్ ప్రకారం గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 19వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 92.6 బిలియన్ డాలర్లు. ఇది భారత కరెన్సీలో రూ. 8.60 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇక ఈ జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 20వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 90.8 బిలియన్ డాలర్లు. ఇది మనదేశ కరెన్సీలో రూ. 8.43 లక్షల కోట్లు. స్టాక్ ధరలు, వ్యాపార పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.

Gautam Adani | ప్రపంచ నంబర్ వన్ మస్కే..

ప్రపంచ కుబేరుల జాబితాలో నంబర్ వన్‌గా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 656 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. రెండో స్థానంలో ల్యారీ పేజ్ (286 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో జెఫ్ బెజోస్ (269 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో సెర్గే బ్రిన్ (266 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో మార్గ్ జుకర్‌బర్గ్ (239 బిలియన్ డాలర్లు), ఆరో స్థానంలో ల్యారీ ఎల్లిసన్ (230 బిలియన్ డాలర్లు), ఏడో స్థానంలో మిచెల్ డెల్ (170 బిలియన్ డాలర్లు), ఎనిమిదో స్థానంలో జెన్‌సెన్ హువాంగ్ (164 బిలియన్ డాలర్లు), తొమ్మిదో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (164 బిలియన్ డాలర్లు), పదో స్థానంలో జిమ్ వాల్టన్ (150 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

Gautam Adani | భారత్‌లో టాప్ టెన్ సంపన్నులు..

భారత్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో లక్ష్మీ మిట్టల్ (36.9 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో శివ్ నాడార్ (33.5 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో షాపూర్ మిస్త్రీ (33.2 బిలియన్ డాలర్లు), ఆరో స్థానంలో సావిత్రి జిందాల్ (32.7 బిలియన్ డాలర్లు), ఏడో స్థానంలో సునిల్ మిట్టల్(25.1 బిలియన్ డాలర్లు), ఎనిమిదో స్థానంలో దిలిప్ శాంగ్వి (24.2 బిలియన్ డాలర్లు), తొమ్మిదో స్థానంలో అజీమ్ ప్రేమ్‌జీ (22.5 బిలియన్ డాలర్లు), పదో స్థానంలో కుమార మంగళం బిర్లా (22.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi | దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం : రాహుల్‌ గాంధీ

Hormuz Strait Tensions | హర్మూజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు.. భారత్‌కు ఇరాన్ భరోసా, అమెరికాపై తీవ్ర విమర్శలు
Hormuz Indian Ships | ఇరాన్​ గుడ్​న్యూస్​.. హర్ముజ్​ నుంచి భారత నౌకలకు అనుమతి
Anthropic Trump Dispute | ఆంథ్రోపిక్‌కు షాకిచ్చిన ట్రంప్..
Iran Airport Attack | ఇరాన్​ ఎయిర్​పోర్టుపై ఇజ్రాయెల్​ దాడి
Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
TAGGED:Adani GroupBillionaires IndexBusiness News IndiaElon MuskGautam Adani RichestMukesh AmbaniReliance IndustriesRichest Person AsiaStock MarketWealth Rankings
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Rally Stock Market Rally | పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు.. రూ. 5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
Next Article Excise CI Bribery Case | Excise CI Bribery Case | ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్​ సీఐ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?