అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hormuz Strait Reopens | ప్రపంచ దేశాలకు ఇరాన్ (Iran) గుడ్‌న్యూస్ చెప్పింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో వేలాది నౌకలు నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల అమెరికా (America)తో సీజ్ఫైర్ (Ceasefire) అమలులోకి వచ్చినా.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ హర్ముజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవలేదు. అయితే తాజాగా కీలక ప్రకటన చేసింది.
Hormuz Strait Reopens | రాకపోకలను అడ్డుకోం
హర్మూజ్ జలసంధి (Hormuz Strait Reopens )ని పూర్తిగా తెరిచామని ఇరాన్ తెలిపింది. చమురు నౌకల (Oil Ships) రాకపోకలను అడ్డుకోమని ప్రకటించింది. ఇరాన్ ప్రకటనతో ముడిచమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి (Abbas Araqchi) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ మిగిలిన కాలానికి హోర్ముజ్ జలసంధి మీదుగా అన్ని వాణిజ్య నౌకల రాకపోకలను పూర్తిగా తెరిచినట్లు ప్రకటించారు. లెబనాన్ (Lebanan)లో కాల్పుల విరమణకు అనుగుణంగా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.
In line with the ceasefire in Lebanon, the passage for all commercial vessels through Strait of Hormuz is declared completely open for the remaining period of ceasefire, on the coordinated route as already announced by Ports and Maritime Organisation of the Islamic Rep. of Iran.
— Seyed Abbas Araghchi (@araghchi) April 17, 2026
దీనిని కూడా చదవండి : Thailand Songkran Deaths | థాయ్‌లాండ్ సోంగ్‌క్రాన్ పండుగలో విషాదం: 191 మంది మృతి, వందలాదిమందికి గాయాలు
